Share News

జిల్లా అంతటా హై అలర్ట్‌

ABN , Publish Date - May 19 , 2024 | 11:36 PM

సార్వత్రిక ఎన్నికలు అనంతరం రాష్ట్రంలోని పల్నాడు, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అలర్ట్‌ అయ్యారు.

జిల్లా అంతటా హై అలర్ట్‌
భీమవరం ఇందిరమ్మ కాలనీలో తనిఖీ చేస్తున్న సీఐ అడబాల శ్రీను

అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో కార్డన్‌ సెర్చ్‌

భీమవరం క్రైం, మే 19 : సార్వత్రిక ఎన్నికలు అనంతరం రాష్ట్రంలోని పల్నాడు, తిరుపతి జిల్లాల్లో జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు అలర్ట్‌ అయ్యారు. జిల్లా ఎస్పీ అజిత వేజేండ్ల ఆదేశాలతో జిల్లాలో ఉన్న అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో పోలీస్‌ అధికారులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నారు. కొత్తవారు ఉంటే వారికోసం ఆరా తీస్తున్నారు. అనుమానిత వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు. మారణాయుధాలు, పెట్రోల్‌, రాళ్ళు వంటివి నివాసాల్లో ఉన్నాయా అంటూ తనిఖీలు చేస్తున్నారు. ఇప్పటికే బాటిళ్ళలో పెట్రోల్‌ పోయరాదంటూ పెట్రోల్‌ బంక్‌ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని ప్రధాన పట్టణాలైన భీమవరంతో పాటు తాడేపల్లిగూడెం, నర్సాపురం, తణుకు వంటి ప్రాంతాల కూడళ్లలో వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.ఎన్నికల అనంతరం విష్ణు కళాశాల, ఎస్‌ఆర్‌కెఆర్‌ కళాశాలల్లో ఈవీఎంలు భద్రపరచడంతో అక్కడ మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు భీమవరం డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి తెలిపారు.

Updated Date - May 19 , 2024 | 11:36 PM