Share News

జోరు వాన

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:45 PM

జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్క సారిగా ఆకాశం మేఘావృతమై ఏకధాటిగా వర్షం పడటంతో పలు చోట్ల ఎక్కువగానే వర్షపాతం నమోదైంది.

జోరు వాన
గొల్లలకోడేరులో నారుమడికి గట్టు వేస్తున్న రైతు

భీమవరం టౌన్‌, జూలై 5: జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్క సారిగా ఆకాశం మేఘావృతమై ఏకధాటిగా వర్షం పడటంతో పలు చోట్ల ఎక్కువగానే వర్షపాతం నమోదైంది. నరసాపురంలో 64.2 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా తణుకులో 9.4 మి.మీ వర్షపాతం నమో దైంది. పెనుమంట్రలో 11.2, పెనుగొండలో 14.8, ఆచంటలో 15.4, పోడూరులో 19.4,మొగల్తూరులో 35.2, పాలకొల్లులో 50.4, యలమంచిలిలో 24.2, గణపవరంలో 16.8 ఆకివీడులో 10.2, ఉండిలో 33.4, పాలకోడేరులో 50.8, వీరవాసరంలో 50.6, భీమవరంలో 40.4, కాళ్ళలో 23.2, తాడేపల్లిగూడెంలో 38.2, పెంటపాడులో 26.2, అత్తిలిలో 16.4, ఇరగవరంలో 19 మి.మీ వర్షపాతం నమో దైంది. జిల్లాలో మొత్తం వర్షపాతం 569.4 మి.మీ నమోద వగా సరాసరి వర్షపాతం 28.5 మి.మీ నమోదైంది.

నీటిలో నారుమళ్లు

పాలకోడేరు, జూలై 5: పంట కాల్వలు నిండుగా ప్రవ హించడంతో పాటు మరోవైపు వర్షాలు కురవడంతో నారు మడుల మునిగాయి. సార్వా సీజన్‌ మొదలైన నాటి నుంచి వర్షాలు కురుస్తూనే ఉండటంతో వేసుకున్న నారు మడులు వర్షం నీటికి మునుగుతూ తేలుతున్నాయి. నారుమడుల్లో ఉన్న నీటిని బయటకు తోడుకుంటున్నారు. పొలాల్లో నీరు బయటకు వెళ్లాలంటే ఇరిగేషన్‌ అధికా రులు స్పందించి కాల్వల్లో ప్రవాహాన్ని తగ్గించాల్సి ఉంది. గొల్లలకోడేరు గ్రామంలోని అనాకోడేరు పంట కాల్వను చేర్చి వందలాది ఎకరాల్లో రైతులు నారుమడులు వేసుకున్నారు. రైతులు నారుమడుల చుట్టూ గట్లు వేసుకుంటూ నారుమడులను రక్షించుకుంటున్నారు. లష్కర్లకు పరిస్థితిని వివరించినా పట్టించుకోవడం లేదని ఆ ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:45 PM