Share News

నన్ను ఎదుర్కొనే దమ్ము లేక.. ఫేక్‌ రాజకీయం!

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:56 AM

‘రాష్ట్రంలో, కైకలూరులోను రాక్షస పాలన సాగు తోంది. దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం అందరిపై ఉంది. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ములేక ఫేక్‌ వీడియోలు తయారుచేసి ఇతర కులస్తు లను నేను దూషిస్తున్నట్టుగా సృష్టించే స్థాయికి స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దిగజారిపోయారు.

నన్ను ఎదుర్కొనే దమ్ము లేక.. ఫేక్‌ రాజకీయం!
కైకలూరు ఆర్వోకు నామినేషన్‌ పత్రాల అందజేస్తున్న కామినేని, చిత్రంలో కేంద్ర మంత్రి మురుగన్‌

కోలాహలంగా నామినేషన్‌ దాఖలు

కైకలూరు, ఏప్రిల్‌ 23 : ‘రాష్ట్రంలో, కైకలూరులోను రాక్షస పాలన సాగు తోంది. దీనికి స్వస్తి పలకాల్సిన అవసరం అందరిపై ఉంది. రాజకీయంగా నన్ను ఎదుర్కొనే దమ్ములేక ఫేక్‌ వీడియోలు తయారుచేసి ఇతర కులస్తు లను నేను దూషిస్తున్నట్టుగా సృష్టించే స్థాయికి స్థానిక ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు దిగజారిపోయారు. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కొవాలే గాని ఫేక్‌ వీడియో సృష్టించి మతాల మధ్య చిచ్చు పెడితే చూస్తూ ఊరు కోను’ అంటూ డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ హెచ్చరించారు. కైకలూరు నియోజకవర్గ అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా ఆయన మంగళ వారం 11.15 గంటలకు ఆర్వో భాస్కర్‌కు నామినేషన్‌ పత్రా లను అందజేశారు. ఆయన వెంట కేంద్రమత్స్యశాఖ సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠలరావు, మాజీ ఎంపీపీ నర్సిపల్లి అప్పారావు ఉన్నారు. వరహాపట్నం నుంచి సుమారు 25 వేల మంది అభిమానులు, కార్యకర్తల నడుమ ప్రచారరఽథంపై ఊరేగుతూ తహసీల్దార్‌ కార్యాలయా నికి చేరుకుని కామినేని నామినేషన్‌ వేశారు. అనంతరం మీడియాతో కామినేని మాట్లాడుతూ.. ‘స్థానికంగా ఉండడంటూ ప్రచారం చేస్తున్నారు. స్థానికంగా ఉండి ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంటానని హామీ ఇస్తున్నా. కరోనా కష్టకాలంలో వందలాదిమంది కరోనా బారిన పడిన వారికి ఆంధ్రా, తెలంగాణలో అనేక ఆస్పత్రుల్లో చేర్చి సేవలందించా. నిరాధరమైన ఆరోపణలు చేస్తూ నాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించిన క్యాట్‌ఫిష్‌ జాతి చేపలను అక్రమ రవాణా చేసి దూలం నాగేశ్వరరావు కోట్లు గడించారు. ఆది నుంచి అక్రమ సంపాదనతోనే ఈ స్థాయికి ఎదిగారు. దమ్ముంటే అక్రమ చేపల వ్యాపారం చేయలేదని ఆలయాల్లో ప్రమాణాలు చేయండి. ఎక్కడికక్కడ రౌడీలను ప్రోత్సహించి ప్రశాంతమైన కైకలూరు ప్రజలను భయబ్రాంతులకు గురిచేశారు. నేను ఎన్నికల్లో గెలిచిన మరుక్షణమే గతంలోలా ప్రజలు స్వేచ్చగా జీవించేలా రౌడీలను, అందుకు సహకరించిన అధికారులను శిక్షించేలా చర్యలు తీసుకుంటాను’ అంటూ ఆయన స్పష్టం చేశారు.

Updated Date - Apr 24 , 2024 | 12:56 AM