Share News

కట్టు తప్పితే వేటే..!

ABN , Publish Date - Apr 03 , 2024 | 12:13 AM

ఎన్నికల విధుల్లో గాడి తప్పిన అధికారులు, ఉద్యోగులపై వేటు పడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్ప టికే అధికార పార్టీతో అంటకాగిన పలువురు వలంటీర్లు, ఇతర శాఖల ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నారు.

కట్టు తప్పితే వేటే..!

అధికారులూ తస్మాత్‌ జాగ్రత్త

కొరడా ఝుళిపిస్తున్న ఎన్నికల సంఘం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఎన్నికల విధుల్లో గాడి తప్పిన అధికారులు, ఉద్యోగులపై వేటు పడుతోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్ప టికే అధికార పార్టీతో అంటకాగిన పలువురు వలంటీర్లు, ఇతర శాఖల ఉద్యోగులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల పనితీరుపై వచ్చిన ఫిర్యాదులతో ఎన్నికల సంఘం వారిని బదిలీ చేసింది. ఐఏఎస్‌లకు ఎక్కడా పోస్టిం గులు ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించారు. ఎన్నికల సంఘం ఇంతలా నిఘా పెట్టింది. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ఇప్పటికే కొందరు ఉద్యోగులపై వేటు పడింది. పెంటపాడులో ఎస్‌ఐని వీఆర్‌లోకి పంపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారంటూ మెట్ట ప్రాంతంలోని ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. వలంటీర్లను విడిచి పెట్టలేదు. అధికార పార్టీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని అందిన ఫిర్యాదులపై పెద్ద సంఖ్యలో వలంటీర్లు సస్పెండ్‌ అయ్యారు. ఎన్నికల కోడ్‌ అమలులోకి రాక ముందు ప్రభుత్వం బదిలీలు నిర్వహించింది. జిల్లా నుంచి మండల స్థాయి వరకు తమకు అనుకూల అధికారులను నియమిం చేలా వ్యవహరించిందంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. నరసాపురం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో అధికార పార్టీ అభ్యర్థి సామాజిక వర్గానికి చెందిన అధికారులు ఉన్నారు. అక్కక మండల, రెవెన్యూ, పోలీసు శాఖల్లో ఒకే సామాజిక వర్గం అధికారులు ఉండడంతో అధికార పార్టీ అభ్యర్థి భుజాలెగరేస్తున్నారు. తమ కేడర్‌ వద్ద ఇదే విషయాన్ని చెబుతున్నారు. వాస్తవ పరిస్థితుల్లో ఎన్నికల సంఘం నిశితంగా పరిశీలిస్తోంది. ఉద్యోగులు, అధికారులు పక్షపాతంతో వుంటే ఫిర్యాదులు చేయాలని రాజకీయ నాయకులతోపాటు, ప్రజలకు సూచిం చింది. ఫిర్యాదులు వెళితే పరిశీలిస్తున్నారు. అది నిజమైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటున్నారు. అధికార పార్టీకి అభిమానం కురిపిస్తూ కోడ్‌ ఉల్లంఘిస్తున్న వారిని పక్కన పెడుతున్నారు. ఎన్నికల నియామవళిని తప్పకూడదంటూ ఇప్పటికే ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అయితే కొంత మంది సచివాలయ ఉద్యోగులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. ప్రభుత్వంపై కృతజ్ఞత చూపాలం టూ వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేసింది. వలంటీర్లతో పెన్షన్‌లు, రేషన్‌ పంపిణీ చేయకూడ దంటూ ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. వారి నుంచి సెల్‌ ఫోన్‌లు, సిమ్‌లు తీసుకోవాలంటూ దిశా నిర్దేశం చేసింది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టారు.

Updated Date - Apr 03 , 2024 | 12:13 AM