Share News

రాజకీయాలకు స్వస్తి : కాపా

ABN , Publish Date - Feb 17 , 2024 | 12:58 AM

ఈ రోజు నుంచి తాను రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్‌, తెలుగు దేశం పార్టీ నాయకుడు కాపా శ్రీనివాసరావు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు.

 రాజకీయాలకు స్వస్తి : కాపా

నూజివీడు, ఫిబ్రవరి 16: ఈ రోజు నుంచి తాను రాజకీయాలకు స్వస్తి చెబుతున్నట్లు నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్‌, తెలుగు దేశం పార్టీ నాయకుడు కాపా శ్రీనివాసరావు శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తనపై నిరాధార ఆరోపలు, అసభ్య పదజాలంతో తనపై, తన కుటుంబీ కులపై సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్న వ్యక్తులను, ప్రోత్సహిస్తున్న స్థానిక టీడీపీ ఇన్‌చార్జ్‌లు, నాయకుల వ్యవహార శైలిని పార్టీ అదిష్ఠానం దృష్టికి తీసుకువెళ్ళినా వారిని అదుపుచేయలేని పార్టీ వ్యవహార శైలికి మనస్థాపం చెంది ఈ రాజకీయాల్లో తాను ఇమడలేనని భావించి రాజకీయాల నుంచి తప్పుకో వాలని నిర్ణయిం చుకున్నట్లు తెలిపారు. నాడు ముద్దరబోయిన ఓటమికి తన పై అభాండాలు వేశారు. ఇప్పుడు పార్థసారథికి పార్టీ టిక్కెట్‌ ఇస్తోంది. నూజి వీడులో లోకల్‌, నాన్‌ లోకల్‌ అనే వ్యత్యాసం బాగా ఉంది. ఈ నేపథ్యంలో ఒక వేళ టీడీపీ స్థాని కంగా మరోసారి పరాజయం పాలైతే ఆ నింద భరించే శక్తి తనకు లేదని కాపా గద్గద స్వరంతో అన్నారు. ఇప్పటి వరకు కుటుంబం పట్ల నిర్లక్ష్యం వహించి, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించానని, పదవులను ఆశించ లేదన్నారు. అయినా తనకు పార్టీలో అవమానాలు జరుగుతున్నాయన్నారు.

కాపాను కలసిన సారథి..?

కాపా నిర్ణయం తెలుసుకున్న ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి శుక్రవారం సాయంత్రం రావిచర్ల గ్రామంలో కాపా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి ఆయనను బుజ్జగించినట్లు సమాచారం. కాపా నిర్ణయం పట్ల పార్టీ అధిష్ఠానం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.

Updated Date - Feb 17 , 2024 | 12:58 AM