ఇంజనీరింగ్‌కి మంచి రోజులు
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:21 AM
ఏపీఈఏపీ సెట్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం బాగుండటం, కూటమి ప్రభుత్వం రాకతో ఇంజనీరింగ్ విద్యకు మంచి రోజులు వచ్చి నట్లేనని అంతా భావిస్తున్నారు.

బాలికలు 80 శాతం.. బాలురు 77 శాతం ఉత్తీర్ణత
కొత్త ప్రభుత్వ విధానాలపై యాజమాన్యాల ఆసక్తి
భీమవరం ఎడ్యుకేషన్, జూన్ 11 : ఏపీఈఏపీ సెట్ ఫలితాలలో ఉత్తీర్ణత శాతం బాగుండటం, కూటమి ప్రభుత్వం రాకతో ఇంజనీరింగ్ విద్యకు మంచి రోజులు వచ్చి నట్లేనని అంతా భావిస్తున్నారు. ఈ ఏడాది ఏపీఈఏపీ సెట్ ఇంజనీరింగ్ విభాగంలో 10,738 మంది విద్యార్థులు హాజరుకాగా 8,459 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 5,685 మందికి 4,393, బాలికలు 5,053కి 4,066 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల శాతం 80 కాగా, బాలుర శాతం 77గా నమోదైంది. అగ్రికల్చర్, ఫార్మసీ విభా గంలో బాలికలు, బాలురు ఇరువురు 88 శాతం మేర ఉత్తీర్ణత సాధించారు. 3,720 మంది పరీక్ష రాయగా 3,276 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 804కి 707, బాలికలు 2921కి 2569 మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది లెక్క ప్రకారం జిల్లాలోని 15 ఇంజనీరింగ్ కళాశాలల్లో మొత్తం సీట్లు 12,030. వీటిలో కన్వీనర్ కోటా సీట్లు 8421 కాగా, మేనేజ్‌మెంట్ కోటా సీట్లు 3609. ఆ లెక్కన 2024 ఏపీఈఏపీ సెట్‌లో 8,459 మంది ఉత్తీర్ణత సాధించారు. దీనిని బట్టి చూసుకుంటే కౌన్సెలింగ్‌లో కన్వీనర్ కోటా సీట్లు పూర్తి స్థాయిలో భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇంజనీరింగ్ విద్యకు నూతన ప్రభుత్వం విధి విధానాలతో మంచి భవిష్యత్ ఏర్పడుతుందని యాజమాన్యాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. గత వైసీపీ సర్కార్ నిర్వా కంతో కళాశాలలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయి. ఇప్పుడు చంద్రబాబు సర్కార్ రావడంతో కళాశాలలకు పూర్వ వైభవం వస్తుందనే ఆశాభావంతో యాజమాన్యాలు ఉన్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజుల రీయిం బర్స్‌మెంట్‌కు సంబంధించి నేరుగా కళాశాలలకు అందించేవి. కాని, జగన్ సర్కార్ విద్యా దీవెన పేరుతో ఆ సొమ్ములను తల్లుల ఖాతాల్లో వేయడం, వీరు కళాశాలలకు ఫీజుల చెల్లిం పులో జాప్యం జరిగేది. ఫలితంగా భారీగా బకాయిలు పడటంతో వీటి నిర్వహణ యాజ మాన్యాలకు తీవ్ర ఇబ్బందిగా మారింది. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో మాదిరి కళాశాలల ఖాతాల్లోకి ఫీజు రీయింబర్స్‌మెంట్ కళాశాలల మెయింటినెన్స్‌ను బట్టి ఫీజుల నిర్ణయం ఉంటుందన్న ఆలోచనలో యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.