ఎరుపెక్కిన గోదావరి
ABN , Publish Date - Jul 05 , 2024 | 11:47 PM
పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదులు పొంగి గోదావరిలో కలుస్తుండడం వల్ల శుక్రవారం గోదావరి నీటిమట్టం పెరి గి పూర్తిగా ఎరుపు రంగులోకి మారింది.

పెరుగుతున్న నీటిమట్టం
పోలవరం, జూలై 5 : పోలవరం ప్రాజెక్టులో గోదావరి నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఉప నదులు పొంగి గోదావరిలో కలుస్తుండడం వల్ల శుక్రవారం గోదావరి నీటిమట్టం పెరి గి పూర్తిగా ఎరుపు రంగులోకి మారింది. గండి పోశమ్మ ఆలయం, పట్టిసీమ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం వద్ద నీటిమట్టం పెరిగింది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే ఎగువన 26.470 మీటర్లు, స్పిల్వే దిగువన 16.350 మీటర్లు, కాఫర్ డ్యాంకి ఎగువన 26.530 మీటర్లు, కాఫర్ డ్యాంకి దిగువన 15.330 మీటర్లు నీటిమ ట్టం నమోదైనట్టు ఈఈలు పి.వెంకటర మణ, మల్లికార్జునరావు తెలిపారు.