Share News

మళ్లీ ముంచుకొస్తోంది

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:20 AM

గోదావరి వరద మళ్లీ పెరు గుతోంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

మళ్లీ ముంచుకొస్తోంది
ఆంధ్రా–తెలంగాణ సరిహద్దు మధ్య రహదారిపై ప్రవహిస్తున్న గోదావరి వరద

అనూహ్యంగా పెరిగిన గోదావరి నీటిమట్టం

భద్రాచలంలో మూడు, ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక.. వణుకుతున్న వేలేరుపాడు

కుక్కునూరు–భద్రాచలం మధ్య రాకపోకలు బంద్‌.. ముంపులోనే వరి పొలాలు

ఐదు రోజులుగా కనకాయలంక కాజ్‌వేపై పడవ ప్రయాణం.. ఉధృతంగా వశిష్ఠ

కుక్కునూరు/వేలేరుపాడు/పోలవరం/ఆచంట/నర సాపురం టౌన్‌, జూలై 27 : గోదావరి వరద మళ్లీ పెరు గుతోంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53 అడుగులు దాటడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల శాఖ వెల్లడించడంతో కుక్కునూరు, వేలేరుపాడు, పోలవ రం, పెనుగొండ, ఆచంట, యలమంచిలి గోదావరి తీర ప్రాంతాల్లో ఆందోళన నెలకొంది. కుక్కునూరు గ్రామ శివారులోకి వరద నీరు ముంచుతోంది. ఇక్కడి వారిని కివ్వాక పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళాలని అధికా రులు ఆదేశించారు. పుల్లప్పగూడెం సమీపంలోకి గోదా వరి వరద వచ్చి చేరింది. వెంకటాపురం ఎస్సీ కాలనీకి వెళ్లి రహదారిలో గోదావరి వరద నీట మునిగింది. గోదావరి మరింత పెరిగితే గొమ్ముగూడెం పంచాయతీ లోని ఉప్పర మద్దిగట్లతోపాటు ఆంబోతులగూడెం, చెరు వు కొమ్ముగూడెం గ్రామాలు ముంపు బారిన పడను న్నాయి. వారం రోజులుగా వేలేరుపాడు మండలంలోని 30 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. గోదావరి ఉపనది తాళిపేరుకు వరద పోటెత్తడంతో లక్షా 20 వేల క్యూసెక్కుల నీటిని దిగువన వున్న గోదావరిలోకి వది లారు. తెలంగాణలోని గోదావరి పరివాహక జిల్లాలైన భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్‌, ఆదిలాబాద్‌, నిర్మల్‌ తదితర జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు కారణంగా వరద నీరు గోదావరికి పోటెత్తుతోంది. ఈ జిల్లాలో మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. భద్రాచలం వద్ద నీటిమ ట్టం 57 అడుగులకు చేరుకుంటే వేలేరుపాడులో వరద నీరు ఇళ్ళలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికే సంత మార్కెట్‌ సెంటర్‌లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించటంతో వాటిని ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. ప్రస్తు తం వరద మండల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జల దిగ్భందంలో చిక్కుకున్న 30 గ్రామాలతోపాటు మరికొన్నింటిని వరద చుట్టుముట్టే ప్రమాదం ఉండటంతో అధికారులు అక్కడి ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. 53 అడుగులకు చేరుకో గానే 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేయడంతో జిల్లా కలెక్టర్‌ వెట్రిసెల్వి వేలేరుపాడులోనే ఉండి వరద పరిస్థి తిని సమీక్షిస్తూ అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. పోలవరంలో గోదావరి నీటిమట్టం శుక్రవారం సాయం త్రానికి స్పల్పంగా పెరిగి 24.027 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద 24.42 మీటర్లకు చేరింది. 13 లక్షల క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేసిన ట్లు, రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు ధవళే శ్వరం బ్యారేజి డీఈఈ రమేష్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా 11,64,264 క్యూసెక్కుల వరద జలాలు దిగువకు విడుదల చేశారు. పట్టిసీమ ఎత్తిపో తల పథకం నుంచి కుడి కాలువకు 15 పంపులతో 5,310 క్యూసెక్కుల జలాలు విడుదల చేశారు.

పశ్చిమలో.. ఉధృతి

రెండు రోజుల క్రితం కాస్త తగ్గిన గోదావరి శనివారం మధ్యాహ్నం నుంచి స్వల్పంగా పెరగడంతో ఆచంట మండలం కోడేరు, పెదమల్లం, కరుగోరుమిల్లి, భీమలా పురంలో ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ కారణంగా గోదావరిలో పడవలు నామమాత్రంగా తిరుగుతున్నాయి. లంక గ్రామాల్లో పల్లపు ప్రాంతాల్లో నీట మునగడంతో కొన్నిచోట్ల పశుగ్రాసం దెబ్బతింది. ఇక్కడ మూగ జీవాలకు పశుగ్రాసం ఇచ్చే ఏర్పాట్లు చేయాలని లంకవాసు లు కోరుతున్నారు. యలమంచిలి మండలం కనకాయ లంక కాజ్‌వే ఐదు రోజులుగా వరద ముంపులోనే ఉండ టంతో ఆ గ్రామాల ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లేం దుకు పడవలనే ఉపయోగిస్తున్నారు. వర్షాలు, వరదల ప్రభావంతో మురుగు కాలువలు ఉధృతంగా ప్రవహి స్తుండటంతో వరి చేలు ముంపులోనే ఉన్నాయి. ముఖ్యం గా లంకగ్రామాల్లో పాడి రైతులు పశువులకు పచ్చగడ్డి దొరకడం లేదని వాపోతున్నారు. మండలంలోని గ్రామా ల్లో పుష్కర ఘాట్‌లు ముంపులోనే ఉన్నాయి. ఎగువ ప్రాంతాల్లో వరద పెరుతుందన్న సమాచారంతో లంకగ్రా మాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నరసా పురం వద్ద వశిష్ఠ గోదావరి వరద ఉధృతి తగ్గలేదు. పిండాల రేవు గుండా వరద నీరు సముద్రంలోకి దూసుకుపోతోంది. గంట గంటకు నీట మట్టాలు పెరుగు తున్నాయి. వరద పెరిగే అవకాశం ఉండటంతో అఽధికారులు అలర్ట్‌ అయ్యారు. రేవుల్లో ఎవరిని స్నానాలకు దిగనివ్వడం లేదు. వలంధర్‌ రేవు వద్ద పోలీస్‌ పికెట్‌ పెట్టారు. ఏటిగట్టుపై పహారా పెంచారు. బలహీనంగా ఉన్న గట్లపై ఇసుక బస్తాలను వేస్తున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:20 AM