Share News

వైభవంగా గోదాదేవికి సారె సమర్పణ

ABN , Publish Date - Jan 08 , 2024 | 12:04 AM

గోకుల తిరుమల పారిజాత గిరి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 21వ రోజు గోదా అమ్మవారికి ఆలయంలో ఉన్న సమస్త దేవతామూర్తులకు చిన్న జీయర్‌స్వామి వారి ఆధ్యాత్మిక సేవా సంస్థ, జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో సారె సమర్పణ వైభవంగా నిర్వహించారు.

వైభవంగా గోదాదేవికి సారె సమర్పణ
పారిజాతగిరిలో గోదాదేవికి సారె సమర్పిస్తున్న భక్తులు

జంగారెడ్డిగూడెం, జనవరి 7:గోకుల తిరుమల పారిజాత గిరి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 21వ రోజు గోదా అమ్మవారికి ఆలయంలో ఉన్న సమస్త దేవతామూర్తులకు చిన్న జీయర్‌స్వామి వారి ఆధ్యాత్మిక సేవా సంస్థ, జంగారెడ్డిగూడెం వికాస తరంగిణి ఆధ్వర్యంలో సారె సమర్పణ వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్లకు నూతన వస్త్రములు, పలు రకాలైన పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ నైవేద్యాలు సమర్పించారు. ప్రధానార్చకుడు నల్లూరు రవికుమార్‌ఆచార్యులు ఆధ్వర్యంలో గోదా అమ్మవారి ఉత్సవమూర్తికి పూజలు నిర్వహించి సారెలో ఉపయోగించిన పండ్లు, ఫలములు, గాజులు, నైవేద్యాలను భక్తులకు అందజేశారు. వికాస తరంగిణి అధ్యక్షురాలు కొల్లూరి శ్యామల, రామ సత్య వీరవెంకట అప్పారావు మాస్టారు, మాడ గోపాలకృష్ణ, మోతుకూరి సత్యనా రాయణ, కొనకల్ల చంద్రశేఖర్‌, హిమగిరి ప్రసాద్‌, తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా.. ధనుర్మాస ఉత్సవం

ద్వారకాతిరుమల, జనవరి7: శ్రీవారి క్షేత్రంలోని విలాస మండపంలో స్వామి, అమ్మవార్లకు ఆదివారం ఉదయం ధనుర్మాస ఉత్సవాన్ని అట్టహాసం గా జరిపారు. తొలుత స్వామివారు, ఉభయదేవేరులు, గోదాదేవి అమ్మవార్లను ఆలయంలో తొళక్క వాహనంపై ఉంచి అలంకరించి, పూజలు చేశారు. ఆ తరువాత క్షేత్రపురవీథుల్లో మేళతాళాలు, డోలు సన్నాయి వాయిద్యాల నడుమ ఘనంగా ఊరేగించారు. అనంతరం ధనుర్మాస మండపంలో ప్రత్యేక పూజలు జరిపి హారతులిచ్చి ప్రసాదాన్ని భక్తులకు పంపిణీ చేశారు.

Updated Date - Jan 08 , 2024 | 12:04 AM