Share News

పాలకొల్లులో గంజాయి మత్తు

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:32 AM

ప్రశాంతంగా వుండే పాలకొల్లు పట్టణంలో గంజాయి విక్రయా లు ఊపందుకున్నాయి.

పాలకొల్లులో గంజాయి మత్తు

పాలకొల్లు/పాలకొల్లు అర్బన్‌, ఏప్రిల్‌ 23 : ప్రశాంతంగా వుండే పాలకొల్లు పట్టణంలో గంజాయి విక్రయా లు ఊపందుకున్నాయి. లారీ స్టాండ్‌, అన్న క్యాంటీన్‌ వెనుక వైపు, మార్కెట్‌ యార్డు, యడ్ల బజారు హిందూ స్మశాన వాటిక, రైల్వే గూడ్స్‌ షెడ్‌ వెనుక వైపు ప్రాంతాల్లో గుట్టుగా గంజాయిని విక్రయిస్తు న్నట్టు సమా చారం. జన సంచారం అధికంగా ఉండే మార్కెట్‌ ప్రాంతంలో ఒక మహిళ గంజా యిని విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఇటీవల 15 – 20 ఏళ్ళ మధ్య వయసు గల యువత గంజాయికి అలవాటు పడి నిర్మానుష్య ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. ఎన్నికల హడా వుడిలో పోలీసులు సైతం గంజాయి విక్రయాలపై దృష్టి సారించలేకపోతున్నారని, పోలీసులు దాడులు జరిపితే గంజాయి అమ్మకందారులు పట్టుపడతారని పరిశీలకులు సూచిస్తున్నారు. ఇటీవల కాలం లో యువత మద్యం జోలికి వెళ్లడం లేదని, సిగరెట్లు కాల్చే వారి సంఖ్య తగ్గిం దని ఈ మార్పు యువతలో సత్ప్రవర్తనకు సంకేతమని భావిస్తున్న తరుణంలో గంజాయి విక్రయాలు ఊపందుకోవడం ఆందోళన కలిగిస్తున్నది. గంజాయి సాగు మొన్నటి వరకూ ఏజెన్సీ ప్రాంతాలకే పరిమితం కాగా ఇప్పుడు సముద్ర తీర ప్రాంతంలోనూ (ఒక ఇంజనీరింగ్‌ కళాశాల వెనుక వైపు) తోటల్లోనూ సాగు చేస్తున్నట్టు తెలిసింది. గంజాయి అమ్మకాలను అరికట్టాలని ప్రజలు పోలీసులను కోరుతున్నారు. అలాగే గంజాయి పీల్చడానికి అలవాటుపడిన యువతను వారి కుటుంబ సభ్యులే గుర్తించి సక్రమ మార్గంలో పెట్టాల్సిన అవసరం వుంది.

Updated Date - Apr 24 , 2024 | 12:33 AM