Share News

అవార్డుల కోసం నామినేషన్ల ఆహ్వానం

ABN , Publish Date - Jun 12 , 2024 | 11:36 PM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రిపబ్లిక్‌డే సందర్భంగా 2025 సంవత్సరానికి దేశపౌర, ప్రతిష్ఠాత్మక పద్మా అవార్డ్స్‌, పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్టు సెట్‌వెల్‌ సీఈవో ఎమ్డీహెచ్‌ మెహర్రాజ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

 అవార్డుల కోసం నామినేషన్ల ఆహ్వానం

ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 12: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రిపబ్లిక్‌డే సందర్భంగా 2025 సంవత్సరానికి దేశపౌర, ప్రతిష్ఠాత్మక పద్మా అవార్డ్స్‌, పద్మవిభూషణ్‌, పద్మభూషణ్‌, పద్మశ్రీ అవార్డుల కోసం నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్టు సెట్‌వెల్‌ సీఈవో ఎమ్డీహెచ్‌ మెహర్రాజ్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అవార్డులు పొందగోరే వారు చేసిన సేవలు, కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక, సాం ఘికసేవ, సైన్స్‌, ఇంజినీరింగ్‌, ప్రజాసంబంధాలు, సివిల్‌ సర్వీస్‌, ట్రేడ్‌, ఇండస్ర్టీస్‌ అవార్డులకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేర్కొన్న రం గాల్లో సేవలు చేసి ఉన్నవారే అర్హులన్నారు. ఉత్తమసేవ కనబరిచిన వారి దరఖా స్తు ఏపీ ప్రభుత్వం వెబ్‌సైట్‌లో 800 పదాలకు మించకుండా జూలై పదో తేదీ లోగా నమోదు చేసుకోవాలన్నారు. పద్మా అవార్డుల ఎంపికకు సంబంధించిన ఇతర వివరాలు భారతప్రభుత్వం శాంతిభద్రతల మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ ప్రతి పాదనలు ప్రతిహార్డ్‌ కాపీ, సెట్‌వెల్‌ కార్యాలయానికి, సాఫ్ట్‌కాపీ, స్టెప్‌డాట్‌ వెస్ట్‌ గోదావరి యట్‌ ది రైట్‌ ఆఫ్‌ జీ మెయిల్‌ డాట్‌ కామ్‌కు మెయిల్‌కు పంపిం చాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Jun 12 , 2024 | 11:36 PM