Share News

కలుషిత ఆహారం తిన్న 36 మంది విద్యార్థులకు అస్వస్థత

ABN , Publish Date - Feb 20 , 2024 | 12:07 AM

జీలుగుమిల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

కలుషిత ఆహారం తిన్న 36 మంది విద్యార్థులకు అస్వస్థత
జీలుగుమిల్లి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

జీలుగుమిల్లి గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలలో ఘటన

ఆరా తీసిన అధికారులు.. వైద్య శిబిరం ఏర్పాటు

జీలుగుమిల్లి, ఫిబ్రవరి 19 : జీలుగుమిల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలకు చెందిన 40 మంది విద్యార్థులు ఆదివారం రాత్రి చికెన్‌, ఇతర ఆహార పదార్థాలను భుజించారు. అయితే సోమవారం వీరిలో 36 మందికి వాంతులు, విరోచనాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి గాయిత్రి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేసి విద్యార్థులకు వైద్య సేవలందించారు. తీవ్ర అస్వస్థతకు గురైన కె.గౌతమ్‌ (7తరగతి), ఎం.హరికృష్ణ (9వతరగతి)లకు ఉన్నత వైద్యం నిమిత్తం తహసీల్దారు ఆర్‌.వి.వెంకటేశ్వరావు కారులో జంగా రెడ్డిగూడెం ఆస్పత్రికి తరలించారు. మరో ఆరుగురు విద్యార్థులను జీలుగు మిల్లి పీహెచ్‌సీలో సోమవారం రాత్రి వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. విషయం తెలుసుకున్న ఐటీడీఏ డీడీ ఎంవీఎస్‌.నాయుడు, ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌వో కేథరిన్‌, తహసీల్దారు, ఎంపీడీవో కేఎం.మంగతాయారు పాఠ శాలను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశా రు. ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టరు నాయుడు హెచ్‌ఎం.రాజు సైతం పాఠశాలకు విచ్చేసి వార్డెన్‌ నవీన్‌, ఏటీడబ్ల్యూవో మోహన్‌కృష్ణల నుంచి వివరాలు సేకరించారు. మొత్తం ఆశ్రమ పాఠశాలలో 320 మంది విద్యార్థులుండగా ముగ్గురు మాత్ర మే వంట పనివారు ఉండడం, విద్యార్థులపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి విషయాలపై సిబ్బందిని ప్రశ్నించారు. నివేదికను కలెక్టరుకు పంపిస్తా మన్నారు. ఆదివారం పాఠశాలలో వండిన చికెన్‌, ఇతర ఆహార పదార్థాలు కలుషితమై ఫుడ్‌ పాయిజన్‌ అయ్యి ఉండవచ్చని వైద్యశాఖ అధికారులు భావి స్తున్నారు. కాగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై టీడీపీ శ్రేణు లు ఆరా తీశాయి. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో పాఠశాలకు వెళ్లి పరిశీలించారు. వైద్యురాలు గాయి త్రి, విద్యార్థులతో మాట్లాడారు. అత్యవసరమైతే విద్యార్థులకు తగిన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. మండల టీడీపీ అధ్యక్షుడు సుంక వల్లి సాయి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నియోజకవర్గ అధ్యక్షుడు బొలగాని అఖిల్‌, నాలి శ్రీను, బి.రాజబాబు, సీహెచ్‌.రవి, జి.శ్రీను, చింటు, సాయిరాం ఉన్నారు.

Updated Date - Feb 20 , 2024 | 12:07 AM