Share News

కారులో మంటలు..

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:15 AM

కొవ్వూరు–గుండుగొలను నూతన జాతీయ రహ దారిపై సోమవారం రాత్రి 8 గంటల సమయంలో మంటల్లో చిక్కుకుని కారు దగ్ధమైంది.

కారులో మంటలు..

భీమడోలు, సెప్టెంబరు 9 : కొవ్వూరు–గుండుగొలను నూతన జాతీయ రహ దారిపై సోమవారం రాత్రి 8 గంటల సమయంలో మంటల్లో చిక్కుకుని కారు దగ్ధమైంది. భీమడోలు మండలం పోలసానపల్లి సమీపంలో కారులో ఒక్క సారిగా మంటలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. రాజమండ్రి నుంచి విజయ వాడ వెళ్తున్న ఈ కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. భీమడోలు ఎస్‌ఐ సుధా కర్‌ అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేసి ట్రాఫిక్‌ నియంత్రించారు. ప్రయాణిస్తున్నవారు అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది.

Updated Date - Sep 10 , 2024 | 12:15 AM