జగనన్న కాలనీల్లో జగడం
ABN , Publish Date - Jul 08 , 2024 | 12:25 AM
జగనన్న కాలనీల్లో పలువురు లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే స్తోమత లేక వేరొకరికి విక్రయించారు. దళారీ జోక్యంతో లబ్ధిదారులు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాతోపాటు స్టాంపు పేపర్‌పై విక్రయించినట్టు ఒప్పందం రాసుకుంటున్నారు.

దళారుల దందాతో నిత్యం తగాదాలు
తాడేపల్లిగూడెం రూరల్, జూలై 7: జగనన్న కాలనీల్లో పలువురు లబ్ధిదారులు ఇల్లు కట్టుకునే స్తోమత లేక వేరొకరికి విక్రయించారు. దళారీ జోక్యంతో లబ్ధిదారులు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాతోపాటు స్టాంపు పేపర్‌పై విక్రయించినట్టు ఒప్పందం రాసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం చేపడితే రుణ మొత్తంలో నగదు లబ్ధిదారుకు, ప్రభుత్వం అందించే సిమెంటు ఐరెన్ కొనుగోలుదారుకు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మెటీరియల్ (ఇసుక, సిమెంటు, ఐరెన్) పొందడంలో దళారీ కీలకంగా వ్యవహరించి కొనుగోలుదారుకు ఇవ్వకుండా దళారి దండుకున్నాడు. ప్రభుత్వం పట్టాతో పాటు మరో రిజిస్ట్రేషన్ పట్టా రావడంతో స్థలం లబ్ధిదారు, కొనుగోలుదారు మధ్య అసలు జగడం జరుగుతోంది. మరికొంత సొమ్ము ఇస్తే కానీ అసలు పట్టా (రిజిస్ట్రేషన్) ఇవ్వనంటున్నారని దళారి దందా సాగిస్తున్నాడు.
తాడేపల్లిగూడెంలో 10 లేఅవుట్‌లలో 3500 మందికి స్థలం అందించగా 2వేలకు పైగా స్థలాలు ఇతరులకు విక్రయించారు. వాటిలో ప్రతీ 10 మంది లో ఒకరు వివాదంలో ఉంటున్నారు. అధికారులు దళారులకు వంత పాడుతున్నారనే ఆరోపణలున్నాయి. లబ్ధిదారులు సంతకం చేసిన కాగితా లు పట్టుకెళితే చాలు మెటీరియల్ ఇచ్చేస్తారనే భావనతో దళారులకు మూడు పూలు ఆరు కాయలు అన్న చందంగా తయారైంది.
మారుబేరాల మారాజు..
జగనన్న కాలనీల్లో ఓ మారుబేరాల మారాజు లక్ష రూపాయలతో పది సైట్‌లకు పది వేలు చొప్పున అడ్వాన్స్‌లు ఇచ్చాడు. తాను రూ.లక్షకు బేరమాడి మరొకరికి లక్షా 50 వేలకు ఆ స్థలాన్ని విక్రయిస్తున్నాడు. అంతేకాదు లబ్ధిదారుకు లేదా కానీ కొనుగోలుదారుకు చెందాల్సిన మెటీరి యల్ అడ్డంగా లాక్కుంటూ జేబులు నింపుకోవడం పరిపాటిగా మారింది. ఈ మూడేళ్లలో జగనన్న కాలనీలో వందకు పైనే ఈ తరహా వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దండుకున్నట్లు అంచనా. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుడికి దగ్గరవుతాడని, దీనితో కోట్ల రూపాయలు దండుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.