Share News

వీడని రేవు పంచాయితీ

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:03 AM

రేవు నిర్వహణదారుడు ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చారు. రోజువారీ మొత్తాన్ని చెల్లించకుండా రూ.45 లక్షలు బకాయి పడ్డాడు. ఇది వసూలు చేసేందుకు అధికారులు అతనికి ఇప్పటి వరకు ఎనిమిది నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన లేదు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది.

వీడని రేవు పంచాయితీ

ప్రభుత్వానికి రూ.45 లక్షలు బాకీ..

రెండ్రోజుల్లో జేఏసీ సమావేశం

నరసాపురం, జూన్‌ 26: రేవు నిర్వహణదారుడు ప్రభుత్వానికి షాక్‌ ఇచ్చారు. రోజువారీ మొత్తాన్ని చెల్లించకుండా రూ.45 లక్షలు బకాయి పడ్డాడు. ఇది వసూలు చేసేందుకు అధికారులు అతనికి ఇప్పటి వరకు ఎనిమిది నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన లేదు. దీనిపై ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. ఈ విషయమై జేఏసీ కమిటీ శుక్రవారం సమావేశంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది మార్చిలో 2024–25 సంవత్సరానికి గాను మాఽధవాయి పాలెం రేవు పాట నిర్వహించాలని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే ఎన్నికల కోడ్‌ రావడంతో పాట వాయిదా పడింది. దీంతో అప్పటి వరకు రేవు నిర్వహించిన పాత పాటదారుడినే ఏప్రిల్‌ నుంచి రేవు నిర్వహణ బాధ్యతలు చేపట్టాలని జేఏసీ కోరింది. రోజుకు రూ.1.05 లక్షల చొప్పున కట్టే విధంగా ఒప్పందం జరిగింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పాత బకాయి రూ 3.62 కోట్లలో పెండింగ్‌ ఏమీ లేకపోవడంతో జెఏసీకి అతనిపై నమ్మకం కలిగింది. మొదట్లో పాట దారుడు రోజువారీ కడుతూ వచ్చాడు. అయితే ఆధికా రులంతా ఎన్నికల బీజీలో పడడంతో బకాయి పెరుగుతూ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఆధికారులు నోటీసులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఇదిగో.. అదిగో అంటూ తేదీలు చెప్పుతూ వాయిదాలు వేస్తూ వచ్చాడు. గత వారం సమావేశమైన జేఏసీ సభ్యులు హైద్రాబాద్‌లో ఉన్న అతనితో నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఈ నెల 21న రూ.35 లక్షలు కడతానని కమిటీకి హామీ ఇచ్చారు. అయితే ఇప్పటివరకు సొమ్ము చెల్లించలేదు. అధికారులు మాత్రం రోజుకు రూ.75 వేలు చొప్పున రేవు నిర్వహిస్తున్న అతని సిబ్బంది వద్ద నుంచి వసూలు చేస్తూ వచ్చారు. పాత బాకీ అలాగే ఉంది. ఈ విషయాలన్నీ ప్రభు త్వానికి చేరడంతో ఆధికారులు సీరియస్‌ అయ్యారు. తక్షణం బాకీ వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సమావేశమై బాకీ వసూలుపై ఓ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీడీవో రమణరావు చెప్పారు.

Updated Date - Jun 27 , 2024 | 12:03 AM