Share News

హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలి

ABN , Publish Date - Feb 15 , 2024 | 11:47 PM

ఏటిగట్టు మరోసారి కుంగడంతో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. నరసాపురం ప్రజల ప్రాణా లతో చలగాటం ఆడుతున్నారంటూ మండిపడ్డారు.

హైకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిపించాలి
ఏటిగట్టును పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యే బండారు, టీడీపీ నాయకులు

ఇంజనీర్ల బృందం ముదునూరి స్ర్కిప్ట్‌ చదివింది : మాజీ ఎమ్మెల్యే బండారు

నరసాపురం, ఫిబ్రవరి 15: ఏటిగట్టు మరోసారి కుంగడంతో మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ప్రభుత్వంపై ఫైర్‌ అయ్యారు. నరసాపురం ప్రజల ప్రాణా లతో చలగాటం ఆడుతున్నారంటూ మండిపడ్డారు. పనుల్లో నాణ్యత, అవినీతిపై రిటైర్డు హైకోర్టు జడ్జి చేత విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. గురువారం కోతకు గురైన ఏటిగట్టును పరిశీలించారు. పనులు చేపట్టిన ఆరు నెలల కాలంలో గట్టు కుంగడం ఇది నాల్గోవసారి.ప్రజలు భయంతో బిక్కుబిక్కుమని గడు పుతుంటే అధికారులకు చీమకుట్టినట్టయినా లేదు. విచా రణ వచ్చిన ఇంజనీర్ల బృందం ఎమ్మెల్యే ముదునూరి రాసిన స్ర్కిప్ట్‌ చదివి వెళ్లారే తప్ప పనులు పరి శీలించ లేదు. భవిష్యత్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారంటూ నిలదీశారు. రూ.27 కోట్లతో జరుగుతున్న ఈ పనులకు ముదునూరి బినామీ, అందు వల్లే పనులు పరిశీలించేందుకు కూడా అధికారు లెవరూ సాహసించడం లేదు. మరో నెలరోజుల్లో ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ముటాముళ్లు సద్దుకుని స్వగ్రామం వెళ్లక తప్పదు. అప్పుడు అవినీతికి కొమ్ముకాస్తున్న అధికారులు బలవుతారు. అధికారులు ప్రజల ప్రాణాలతో చలగాటం అడకుండా పనుల నాణ్యతపై శ్రద్ధ చూపాలని డిమాండ్‌ చేశారు. పొన్నమండ నాగేశ్వరరావు, చిటికెల రామ్మోహన్‌, అండ్రాజు రామన్న, తంగేళ్ళ నాగేశ్వరరావు, సత్యనారాయరాజు, రేవు ప్రభుదాసు, కె.శ్రీను, హేమలత, సురేష్‌, చాగంటి ఆనంద్‌, దానియేలు, మల్లిక్‌, రెడ్డిం శ్రీను, పి.ఽశ్రీధర్‌లు పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 11:47 PM