Share News

ఓటు భద్రం !

ABN , Publish Date - May 15 , 2024 | 12:01 AM

ఏలూరు జిల్లా వట్లూరులోని సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూమ్‌కు ఈవీఎంలు చేరుకున్నాయి. జిల్లాకు సంబంఽధించి 1,744 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఇక్కడ భద్రపరచటం జరిగింది.

ఓటు భద్రం !
కలెక్టర్‌ వెంకటేష్‌ సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌కి సీల్‌ వేస్తున్న ఎన్నికల సిబ్బంది

స్ర్టాంగ్‌ రూమ్‌కు చేరుకున్న ఈవీఎంలు

ఏలూరుసిటీ, మే 14: పోలింగ్‌ ముగిసింది. ఈ ఎన్నికలలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్‌ జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా పోలింగ్‌ ప్రక్రియను నిర్వహించారు. దీంతో పోలింగ్‌ సామాగ్రి స్టాంగ్ర్‌ రూమ్‌లకు చేరేందుకు తెల్లవారుజాము వరకు సమయం పట్టిందని చెబు తున్నారు. ఏలూరు జిల్లా వట్లూరులోని సీఆర్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్‌ రూమ్‌కు ఈవీఎంలు చేరుకున్నాయి. జిల్లాకు సంబంఽధించి 1,744 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంలను ఇక్కడ భద్రపరచటం జరిగింది. ఈవీఎంలను మూడంచెల భద్రత నడుమ స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు.ఓటింగ్‌ ప్రక్రియ ముగియగానే సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీల్‌ వేసిన ఈవీఎంలు,వీవీ ప్యాట్‌లు జీపీఎస్‌ అనుసంధానం చేసిన ట్రాకింగ్‌ వాహనాలలో ఏలూరు చేరుకున్నాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ పరిశీలించారు. కేంద్ర పారా మిలటరీ భద్రతా బలగాలు ఉంటాయి. రెండవ అంచెలో రాష్ట్ర రిజర్వ్‌ ఽభద్రతా దళాలు, మూడవ అంచెలో స్థానిక పోలీస్‌ ఫోర్స్‌ భద్రత అందిస్తున్నాయి. స్ట్రాంగ్‌ రూమ్‌లకు చేరిన ఈవీఎంలను పోలింగ్‌ సిబ్బంది, ఏజెంట్లు, వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో సీల్‌ వేసి కేంద్ర భద్రతా బలగాలకు అప్పగించారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ (ఐటిబిపి) కేంద్ర భద్రతా దళాలు పహారా కాస్తుండగా, దాని వెలుపల రాష్ట్ర రిజర్వు పోలీస్‌ దళాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి.

మూడంచెల భద్రత : కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌

ఈవీఎంలను మూడంచెల భద్రత వ్యవస్థల మధ్య భద్రపరిచినట్టు జిల్లా కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ చెప్పారు. జిల్లాలో సోమవారం ఏలూరు పార్లమెంట్‌, 7 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరిగాయన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఈవీఎంలను భద్రపరిచే కార్యక్రమాన్ని మంగళవారం ఉదయం వరకు జిల్లా కలెక్టర్‌ దగ్గరుండి పర్య వేక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యలు కారణంగా పోలింగ్‌ సిబ్బంది ఎటువంటి ఇబ్బందులు పడకుండా పోలింగ్‌ ముగిసిందన్నారు. ఈవీఎంలను మూడంచెల భద్రతా ఏర్పాట్ల మధ్య భద్రపరిచాన్నారు. జూన్‌ 4న ఏలూరు సీఆర్‌ఆర్‌ ఇంజ నీరింగ్‌ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. పోలింగ్‌ నిర్వహణలో సహకరించిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు కృష్ణకాంత్‌ పాఠక్‌, ఎస్‌ఏ రామన్‌, ఎస్పీ మేరీ ప్రశాంతి, జేసీ లావణ్యవేణి , ఐటీడీఏ పీవో సూర్యతేజ ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2024 | 12:01 AM