ఏజెన్సీలో మరో ఏకలవ్య స్కూల్
ABN , Publish Date - Oct 25 , 2024 | 12:24 AM
ఏజెన్సీ ప్రాంతంలో మరో ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎం పీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ తెలిపారు.

బుట్టాయగూడెం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతంలో మరో ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఎం పీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్ తెలిపారు. విప్పలపాడు ఏకలవ్య మోడల్ స్కూల్‌ను గురు వారం ఆయన పరిశీలించారు. పిల్లలకు సౌకర్యా లు, ఉత్తీర్ణత శాతాన్ని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌలిక సదుపా యాల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నూరుశాతం ఉత్తీర్ణత సాధనకు ఉపాధ్యాయులు కృషిచేయాలని తెలిపారు. కొయ్యలగూడెంలో డిగ్రీ కళాశాల, అగ్నిమాపక కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని ఎంపి తెలిపారు. ఏజెన్సీలో 2 వేల కోట్ల ఖర్చుతో ఆయుధ కర్మాగారం నిర్మాణా నికి కేంద్రం సుముఖంగా ఉందని, కొందరు కర్మాగారం నిర్మాణం జరగకుండా అడ్డుపతున్నా రని తెలిపారు. ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఏపీవో పీవీఎస్ నాయుడు, ఏఎంవో కె.శిర మయ్య, డీవైఈవో కె.నీలయ్య, ప్రిన్సిపాల్ ప్రవీణ్‌కుమార్ మిశ్రా, నాయకులు మొగపర్తి సోంబాబు, యంట్రప్రగడ శ్రీనివాసరావు, గద్దె అబ్బులు, కరాటం సాయిబాబా, నల్లూరి కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.