Share News

ప్రైవేట్‌ ఎలక్ర్టీషియన్లను ఆదుకోవాలి

ABN , Publish Date - Feb 25 , 2024 | 11:50 PM

వెలుగును పంచే ప్రైవేట్‌ ఎలక్ర్టీషియన్‌లకు ప్రభుత్వ విధానాల కారణంగా అంధకారంలో మగ్గుతున్నారని, భవననిర్మాణ రంగంలో సరైన సదుపాయాలు లేక ప్రైవేట్‌ ఎలక్ర్టీషియన్‌లు వీధిన పడుతు న్నారని వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ర్టికల్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్రప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ప్రైవేట్‌ ఎలక్ర్టీషియన్లను ఆదుకోవాలి
ఐఖ్యత చాటుతున్న నాయకులు

ఏలూరు రూరల్‌, ఫిబ్రవరి 25: వెలుగును పంచే ప్రైవేట్‌ ఎలక్ర్టీషియన్‌లకు ప్రభుత్వ విధానాల కారణంగా అంధకారంలో మగ్గుతున్నారని, భవననిర్మాణ రంగంలో సరైన సదుపాయాలు లేక ప్రైవేట్‌ ఎలక్ర్టీషియన్‌లు వీధిన పడుతు న్నారని వీరిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ఎలక్ర్టికల్‌ వర్కర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్రప్రధాన కార్యదర్శి బొజ్జా రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన రాష్ట్ర జనరల్‌ బాడీ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన వతూఉతూ భవన నిర్మాణ రంగంలో ఉన్న అనేక సదుపాయాలు ఇప్పుడు లేవన్నారు. ఒక ప్రమాదం జరిగితే రూ.2 లక్షలు, చనిపోతే రూ.5 లక్షలు, కుటుంబసభ్యులకు స్కాలర్‌షిప్‌లు ఇచ్చేవారని జగన్‌ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క పథకం అందడం లేదన్నారు. సంక్షేవ ుబోర్డును సైతం తీసివేశారని, దీని ద్వారా భవననిర్మాణ కార్మికులను జగన్‌ నట్టేట ముంచారని విమర్శించారు. వసూలు చేస్తున్న సెస్‌ ఎక్కడికి పోతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్మికశాఖ మంత్రి కనీసం సమస్యలు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పట్టించుకోకుంటే తమ సత్తా చాటు తామని రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల యాభై వేల మంది ఉన్నారని తెలిపారు. కార్మికశాఖ క్లైములు విడుదల చేయాలని, చెస్‌ నిలుపుదల చేసి ప్రభుత్వమే టూల్‌ కిట్‌లు ఇవ్వాలని, మెప్మా ద్వారా రుణాలు మంజూరు, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పిం చాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రైవేట్‌ ఎలక్ర్టీషియన్ల ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. క్లైయిములు పరిష్కరించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పూనుకుంటామని హెచ్చ రించారు. ఉపాధ్యక్షుడు టి.తారక్‌నాథ్‌, బి.శ్రీనివాసరావు, కె.రాజకుమార్‌, ఎం.శ్రీని వాసరావు, ఎన్‌.గంగాధరం, డాల్‌ఫిన్‌, కె.అశోక్‌కుమార్‌, చంద్రశేఖర్‌, కోటేశ్వరరావు, చిట్టిబాబు, వివిధ జిల్లాల నుంచి ఎలక్ర్టీషియన్లు పాల్గొన్నారు.

Updated Date - Feb 25 , 2024 | 11:50 PM