Share News

స్వేచ్ఛగా ఓటేయండి

ABN , Publish Date - Mar 22 , 2024 | 12:47 AM

టర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని జాయింట్‌ కలెక్టర్‌, ఆర్వో బి.లావణ్యవేణి అన్నారు.

స్వేచ్ఛగా ఓటేయండి
దెందులూరులో రాజకీయ నేతలతో మాట్లాడుతున్న జేసీ

ఓటర్లకు అధికారుల భరోసా

రాజకీయ పార్టీలు నిబంధనలు పాటించాలి

దెందులూరు, మార్చి 21: ఓటర్లు ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా ఓటు వేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామని, రాజకీయ పార్టీలు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని జాయింట్‌ కలెక్టర్‌, ఆర్వో బి.లావణ్యవేణి అన్నారు. నియోజకవర్గంలో రాజకీయ పార్టీల నేతలతో ఎన్నికల నియమావళిపై గురువారం సమావేశం నిర్వహించారు. రాజకీయ నాయకులు ఎన్నికల ప్రచారానికి ముద్రించే కరపత్రాలపై వివరాలు కూడా ముద్రించాలన్నారు. లేకుంటే నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటామ న్నారు. ప్రచారం, ప్రకటనలలో కుల, మత, భాషాపరమైన అంశాలు, విద్వేషాలను రగిల్చే అంశాలు ఉండకూడదన్నారు. నిబంధనలు అతిక్రమిం చిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో టీడీపీ, వైసీపీ, జనసేన. కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.

ఏలూరు రూరల్‌: రాజకీయపార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి ఎం.ముక్కంటి తెలిపారు. తహసీల్దార్‌ కార్యాలయంలో రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో మోడల్‌ కోడ్‌పై గురువారం సమావేశం నిర్వహించారు. నియో జకవర్గంలో 200 పోలింగ్‌స్టేషన్‌ల పరిధిలో మోడల్‌కోడ్‌ అమల్లో ఉందన్నా రు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ఊరేగింపులు నిర్వహించా లన్నా అనుమతి తీసుకోవాలని సూచించారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడు తూ రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు నిర్వహించేటప్పుడు ముందస్తు సమాచారం ఇవ్వాలని, తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. సమా వేశంలో తహసీల్దార్‌ మురర్జీ, ఎస్‌ఐలు రాజశేఖర్‌, వెంకటేశ్వర్లు, ప్రభాకర్‌, రాజారెడ్డి, రవితేజ, రెవెన్యూశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

లింగపాలెం: మండలంలో రాజకీయపార్టీల నాయకులతో తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎస్సై పి.చెన్నారావు సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధి విధానాలపై అవగాహన కల్పించారు. ప్రతిఒక్కరూ ఎన్నికల కోడ్‌ పాటించా లన్నారు. అనుమతి లేకుండా ప్లెక్సీలను పెట్టకూడదని ర్యాలీలు, సభలు నిర్వహించరాదన్నారు. ఎన్నికల సిబ్బంది, రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

జంగారెడ్డిగూడెం: ఎన్నికల నియమావళిని పాటించి పోలీసులకు సహకరించాలని సీఐ రాజేష్‌ అన్నారు. మండలంలోని దేవులపల్లిలో ఎన్నికల నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కును నిర్భయం గా వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. లక్కవరం ఎస్‌ఐ సుధీర్‌, సిబ్బంది పాల్గొన్నారు.

టి.నరసాపురం: ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కర పాటించాలని డీఎల్‌పీవో ఎం.రజావుల్లా తెలిపారు. అప్పలరాజుగూడెం, బండివారిగూడెం తదితర గ్రామాల్లో ఎన్నికల నియమావళిపై అవగాహన కల్పించారు. సచివాలయ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈవోపీఆర్డీ రాంప్రసాద్‌, కార్యదర్శి నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 12:47 AM