Share News

ఎన్నికలయ్యేంతవరకు ఇక్కడే ఉంటా

ABN , Publish Date - Apr 24 , 2024 | 12:34 AM

ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై తనను నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చునని ఏలూరు జిల్లా ఎన్నికల సాధారణ పరి శీలకుడు కృష్ణకాంత్‌ పాఠక్‌ చెప్పారు. ఎన్నికల సాధారణ పరిశీకునిగా ఆయన మంగళవారం భాధ్యతలు స్వీకరించారు.

ఎన్నికలయ్యేంతవరకు ఇక్కడే ఉంటా
ఎన్నికల అబ్జర్వర్‌గా వచ్చిన డాక్టర్‌ కృష్ణకాంత్‌ పాఠక్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎస్పీ ప్రశాంతి

ఉల్లంఘనలపై 91546 90388 నంబర్‌కు ఫిర్యాదు చేయండి

ఎన్నికల సాధారణ పరిశీలకుడు కృష్ణకాంత్‌ పాఠక్‌

ఏలూరుసిటీ, ఏప్రిల్‌ 23: ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై తనను నేరుగా కలిసి ఫిర్యాదు చేయవచ్చునని ఏలూరు జిల్లా ఎన్నికల సాధారణ పరి శీలకుడు కృష్ణకాంత్‌ పాఠక్‌ చెప్పారు. ఎన్నికల సాధారణ పరిశీకునిగా ఆయన మంగళవారం భాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో తనను స్వయంగా కలిసి సమాచారాన్ని అందిం చవచ్చునన్నారు. ఉదయం 11 గంట ల్లోపు లేదా సాయంత్రం 5 గంటల దాటిన తర్వాత తనను కలిసి ఫిర్యాదులను వీలైతే సాక్ష్యాలతో సహా సమ ర్పించాలన్నారు. లేదా తన ఫోన్‌ నెంబర్‌ 91546 90388కు ఫోన్‌ చేసి వివరాలు తెలియ జేయవచ్చన్నారు. ఏలూరు పార్లమెంట్‌, ఏలూరు, ఉంగు టూరు, దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ ఎన్నికల పరిశీల కునిగా బాధ్యతలు స్వీకరించానన్నారు. జిల్లా కలెక్టర్‌ కార్యాలయం సమీపంలోని రెవెన్యూ అతిధి గృహంలో బస చేశానన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉంటానని, జిల్లాలో ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరిగి నట్లు ప్రజలు ఎక్కడైనా గుర్తిస్తే అందుకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

Updated Date - Apr 24 , 2024 | 12:34 AM