Share News

ఈ సీజన్‌కు ఇంతే..!

ABN , Publish Date - May 19 , 2024 | 12:31 AM

ఎన్నికల పండుగలో అటు జనం ఇటు ప్రభుత్వ యంత్రాంగం మునిగితేలింది. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు గడిచిన రెండుమాసాలుగా కంటిమీద కునుకు లేకుండా నిమగ్నమయ్యారు.

ఈ సీజన్‌కు ఇంతే..!
కొత్తూరు – గుర్వాయి పాలెం రహదారి దుస్థితి

ఎన్నికల దెబ్బతో అంతా మటాష్‌

ఎక్కడికక్కడే వార్షిక ప్రణాళిక అమలుకు ఆటంకాలు

అడిగేవారు లేరు.. సమాధానం ఇచ్చేవారు అంతకంటే లేరు

కాల్వల ఆధునికీకరణ గాలికి వదిలేశారు

పథకాల అమలు ఆగిపోయింది..

పోలింగ్‌ తర్వాత గాడిన పడని యంత్రాంగం

( ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి )

ఎన్నికల పండుగలో అటు జనం ఇటు ప్రభుత్వ యంత్రాంగం మునిగితేలింది. ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు గడిచిన రెండుమాసాలుగా కంటిమీద కునుకు లేకుండా నిమగ్నమయ్యారు. మరే ఏపథకం ఊసు ఎత్తకుండా కేవలం ఎన్నికల నిర్వహణ మీదే దృష్టి పెట్టారు. ఇక ఓటర్లు రాజకీయ ప్రచారాలు, పార్టీలకు అనుకూలత, వ్యతిరేకత వైపు మొగ్గు చూపారే తప్ప తమకు అమలు కావా ల్సిన పథకాల గురించి సీజన్‌ మారి కొత్త సీజన్‌ వస్తున్న నేపథ్యంలో ప్రతిసారి జరిగే పనులు స్తంభించినా యంత్రాం గాన్ని ప్రశ్నించిన పాపాన పోలేదు.

అంతా ఎన్నికలమయం

వేసవి సీజన్‌ వచ్చిందంటే పట్టణం, పల్లె తేడా లేకుండా తాగునీటి సరఫరా, కొరత ఎదుర్కొనే గ్రామాలు, పట్టణాల వైపే దృష్టి సారించేవారు. ఆ దిశగానే ప్రత్నామ్నాయ చర్యలకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించు కునేవారు. ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా క్షణాల్లో తీరిపోయేలా జాగ్రత్త పడేవారు. ఒకవైపు ప్రజాప్రతినిధులు, అధికారులు వెంట పడి మరీ పనులు చేయించేవారు. సాధా రణ జనం సైతం రోడ్డుకు ఎక్కి నిలదీసి సమస్య పరిష్కారానికి ఏదో రూపంలో తమవంతు కృషి చేసేవారు. కాని ఈసారి వచ్చిన ఎన్నికల నేపథ్యంలో సమ స్యలన్నీ గాల్లో కలిశాయి. ఏ ఒక్క ప్రధాన సమస్య తెరముందుకు రానేరాలేదు. ఒకవేళ వచ్చినా తామంతా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో క్షణం తీరకలేకుండా ఉన్నామంటూ అధికారులు దాటేశారు. కొందరు గట్టిగా ప్రశ్నించినా ఎన్నికల కోడ్‌ అమలులో ఉందంటూ తప్పించుకునే ఘటనలు లేకపోలేదు. తాగునీటి సమస్య ఎదురయ్యే ప్రాంతాలు అన్నింటిలోనూ ఈ సీజన్‌లో కనీసం పట్టించు కున్న దిక్కే లేదు. ఈ దిశగా యంత్రాంగం సైతం సమీక్షించనులేదు. పనిలో పనిగా వేసవిదాటి తొలకరి వస్తుంటే నెలరోజులు ముందుగానే పంట కాల్వల ఆధునికీకరణ, మరమ్మతులు చేయాల్సి ఉంది. ఏలూరు జిల్లా పరిధిలో కృష్ణా కెనాల్‌ మరమ్మతులు, నిర్వహణ ఏటా వేసవిలోనే చేపట్టేవారు. ఈ ఎన్నికల సీజన్‌లో ఏ ఒక్కరూ ఆవైపు దృష్టేపెట్టలేదు. ఓఅండ్‌ఎం పనులు మూలన పడ్డాయి. ఎంత మేర పనులు చేసింది? అధికారులు వెల్లడించను లేదు. ఒకవైపు మంచినీటి సరఫరా, ఇంకోవైపు సాగునీరు అందించే కాల్వల స్థితిగతు లపై అంతా సైలెంట్‌. మరో 20 రోజుల వ్యవధి లోనే తొలకరి రానుంది. ఎన్ని కలు పూర్తయ్యాయి కాబట్టి మిగతా సమయాన్ని పక్కా కార్యాచరణతో పూర్తి చేయాల్సి ఉన్నా ఇరిగేషన్‌ అధికారులతో పాటు ఆర్‌డబ్ల్యూఎస్‌, మిగతా అనుబంధ శాఖలు ఈవైపు దృష్టిపెట్టిన పాపాన పోలేదు.

కాలనీలను కప్పేశారు

జగనన్న కాలనీల్లో మెరక పోయడం, వీధిలైట్లు అమర్చడం వంటి పనులతో నోటీఫికేషన్‌కు ముందు హడావుడి చేసిన యంత్రాంగం ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయినట్లే కనిపిస్తోంది. వేసవిలో పూర్తి కావాల్సిన పనులు పూర్తయితే తప్ప వర్షాకాలంలో ఈ పనులు ముందుకు సాగనే సాగవు. ఎన్నికల కోడ్‌ ఇంకా పూర్తిగా తొలగించలేదు కాబట్టి ఈ పథకాల అమల్లో అధికారులు కన్నెత్తి చూడకపోవచ్చు. కాని పాత పథకాలే కొనసాగిస్తున్నందున దీనికి అనుగుణంగానే వ్యవహరించాల్సిన యంత్రాంగం కూడా మీనమేషాలు లెక్కిస్తోంది. ఇదిలా ఉండగా ఎన్నికలకు ముందు వివిధ ప్రభుత్వ పథకాలకు సీఎం జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లోకి సొమ్ము జమ అంటూ హడావుడి చేశారు. బటన్‌ నొక్కి మూడునెలలు అవుతున్నా ఇప్పటికి ఏ ఒక్కరి ఖాతాలోనూ నిధులు జమ కాలేదు. లబ్ధిదారులు సంబంధిత అధికారుల చుట్టూ తిరుగుతుంటే అందరికీ అందితే.. మీకు అందుతుందంటూ వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. ఎప్పుడో మూడు నెలల ముందే బటన్‌ నొక్కినా ఎందుకు ఇలా జరిగిందంటూ కొందరు నేరుగా అధికారులను నిలదీస్తున్నారు.

అందరి దృష్టి ఒకవైపే..

సార్వత్రిక ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి అటు యంత్రాంగం, ఇటు జనం చూపంతా ఆవైపే పడింది. కొన్ని పనులు చేయడానికి నిధులు లేక, రాక అధికారులు చేతులెత్తేస్తే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కావా లనే కొందరు ఈ పనులు అన్నింటికి అడ్డు తగులుతు న్నారంటూ అధికార వైసీపీ, ప్రతిపక్షాలపై బురద చల్లుతూ వచ్చింది. ఓ అడుగు ముందుకు వేసి తిరిగి తాము అధికారంలోకి వస్తేనే ఈ పనులన్నీ పూర్తవుతాయని, లేకపోతే అంతే సంగతంటూ పోలింగ్‌ సమ యం వరకు ప్రజలను మభ్యపెడు తూనే వచ్చారు. పథకాల అమ లుకు నయాపైసా కూడా విడు దల చేయని విషయాన్ని అధి కార పార్టీ ఎక్కడా నోరు విప్పి తే ఒట్టు. ఎన్నికల వ్యవహారం నడుస్తోంది కాబట్టి అధికారు లంతా ఆ పనుల్లోనే నిమగ్నమై ఉండగా, ఇటు జనం సమస్యలు, పక్కన పడేశారు. వేసవిలోనే పూర్తి చేయాల్సిన రోడ్ల మరమ్మతులు, నిర్వహణ పనులు ఎన్నికల గాలిలో కలిసిపోయాయి. ఇప్పటికి అన్ని ప్రధాన మార్గాల్లోనూ రోడ్లు ఛిద్రమై కనిపిస్తున్నాయి. ఆఖరికి బడులు తెరిచేందుకు ఇంకా తక్కువ సమయం మిగిలి ఉండగా, ఆ ఏర్పాట్లలోనూ కోడ్‌ బూచ్‌ని చూపి చర్యలకు దిగితే ఒట్టు. ప్రత్యేకించి జూన్‌లో సీజనల్‌ వ్యాధులు ముంచెత్తు క్రమంలోనూ ఇప్పటివరకు ప్రభుత్వపరంగా కార్యాచరణ ప్రకటించలేదు. మునిసిపాలిటీలు, కార్పొరేషన్‌ పరిధిలోనూ యంత్రాంగానిది ఇదే తీరు.

Updated Date - May 19 , 2024 | 12:31 AM