Share News

2,129 అభ్యర్థనలు పరిష్కారం

ABN , Publish Date - Apr 25 , 2024 | 12:19 AM

కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ. 13.74 కోట్లు విలువైన నగదు, బంగారం, మద్యం , ఇతర వస్తువులు సీజ్‌ చేశామని ఏలూరు జిల్లా కలెక్టర్‌ వె.ప్రసన్నవెంకటేష్‌ తెలిపారు.

 2,129 అభ్యర్థనలు పరిష్కారం
ఏలూరులో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు

కలెక్టర్‌ వెంకటేశ్‌

ఏలూరుసిటీ, ఏప్రిల్‌ 24: సార్వత్రిక ఎన్నికల నేపఽథ్యంలో ఈఎస్‌ఎంఎస్‌ కింద చేపట్టిన సీజర్‌ మేనేజ్‌మెంట్‌ ప్రక్రియ ద్వారా ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా రూ. 13.74 కోట్లు విలువైన నగదు, బంగారం, మద్యం , ఇతర వస్తువులు సీజ్‌ చేశామని ఏలూరు జిల్లా కలెక్టర్‌ వె.ప్రసన్నవెంకటేష్‌ తెలిపారు. ఇందులో రూ. 206.35 లక్షలు నగదు, రూ. 10.17 కోట్లు విలువైన బంగారం, వెండి ఆభరణాలు, రూ.143.24 లక్షలు విలువ చేసే మద్యం స్వాధీన పరచుకున్నామన్నారు. జిల్లా ప్రచార అనుమతుల కోసం సువిధ/ ఎన్‌కోర్‌ ద్వారా ఎన్నికల ప్రచారం కోసం 2,167 అభ్యర్ధనలు రాగా వాటిలో ఇంతవరకు 2,129 అనుమతులు జారీ చేయగా మిగిలిన 38 పరిశీలనలో ఉన్నాయని తెలిపారు. సి–విజిల్‌ ద్వారా 410 ఫిర్యాదులను పరిష్క రించామని తెలిపారు. ఎన్‌జీఎస్పీ పోర్టల్‌ ద్వారా 643 ఫిర్యాదులు స్వీకరించగా వీటిలో 638 పరిష్కరించామన్నారు.

రూ.2.96 లక్షలు స్వాధీనం

ద్వారకాతిరుమల/ఉంగుటూరు ఏప్రిల్‌24: ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంట వద్ద ఓ మహిళ వద్దనున్న రూ. 2 లక్షలు ప్లైయింగ్‌ స్వ్కాడ్‌ బృందం బుధవారం పట్టుకున్నారు. ఐఎస్‌ రామానుజపురానికి చెందిన ఓ మహిళ ద్వారకా తిరుమల నుంచి స్వగ్రామానికి వెళ్తున్న సందర్భంగా బృంద సభ్యులు తనిఖీలు చేసి ఈ నగదును సీజ్‌ చేసి ద్వారకాతిరుమల తహసీల్దారు రవికాంత్‌కు అప్పగించారు. ఉంగుటూరు ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ టీం జరిపిన తనిఖీలలో బుధవారం రూ.95 వేలు స్వాధీనం చేసుకున్నారు.

వాహనాల తనిఖీ

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 24 : ఏలూరు నగరంలో పోలీసులు బుధవారం సాయంత్రం విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. త్రి టౌన్‌ సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో త్రిటౌన్‌ ఎస్‌ఐలు ప్రసాద్‌, రామారావు సిబ్బందితో నగరంలోని వాహనాలను తనిఖీలు చేశారు.

Updated Date - Apr 25 , 2024 | 12:19 AM