Share News

విస్తృతంగాఎన్నికల తనిఖీలు

ABN , Publish Date - May 03 , 2024 | 12:13 AM

ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు

విస్తృతంగాఎన్నికల తనిఖీలు
కొత్తూరు చెక్‌పోస్టు వద్ద పట్టుకున్న నగదుతో సిబ్బంది

ఏలూరు క్రైం, మే 2 :ఎన్నికల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు. బుధవారం రాత్రి 7 గంటల నుంచి గురువారం రాత్రి 7 గంటల వరకూ గడిచిన 24 గంటల్లో జిల్లా వ్యాప్తంగా 23.9 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ 7,360 రూపాయలు అని తెలిపారు. ప్లైయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీల్లో చేసుకున్న రూ.70 వేలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా ఎస్‌ఈబీ దాడులు

ఎస్‌ఈబీ అదనపు ఎస్పీ సూర్యచంద్రరావు ఆధ్వ ర్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహిం చారు. మంగళవారం జిల్లాలోని చింతలపూడి, భీమడోలు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం, ఏలూరు, కైకలూరు ఎస్‌ఈబీ పోలీస్‌స్టేషన్‌ అధికారులు, చెక్‌ పోస్టుల వద్ద సిబ్బంది దాడులు నిర్వహించారు. సారా తయారీ, విక్రయదారులపై 4 కేసులు నమోదులు చేసి వారి నుంచి 35 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. 2,800 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం చేసి రెండు కేసులు నమోదు చేశారు. డ్యూటీ పెయిడ్‌ లిక్కర్‌ కల్గి ఉన్న వారిపై 10 కేసులు నమోదు చేసి 70.3 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.మొత్తం 16 కేసులలో 12 మంది వ్యక్తులను అరెస్టు చేశారు. మిగిలిన వారిని అరెస్టు చేయాల్సి ఉంది. 18 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేసినట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

అక్రమ మద్యం నియంత్రణకు కంట్రోల్‌ రూమ్‌

ఎన్నికల సమయంలో అక్రమ మద్యం నియంత్రణకు జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశా మని జిల్లా ఎక్సైజ్‌ సూపరిం టెం డెంట్‌ డాక్టర్‌ కుమరేశ్వరన్‌, ఎక్సైజ్‌ డిపో మేనేజర్‌ దేవదత్తు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అక్రమ మద్యం, తదితరాలపై ఫిర్యాదులను 08812–355350 నంబర్‌కు ఫోన్‌ చేయ వచ్చన్నారు. జిల్లాలో ఇంతవరకు అక్రమంగా మద్యం తరలిస్తున్న 9 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసి వారి నుంచి 207 మద్యం బాటిళ్ళను, 5 ద్విచక్ర వాహ నాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎన్నికల ప్రవ ర్తనా నియమావళి ఉల్లంఘించిన నలుగురు ఉద్యోగు లను తొలగించామన్నారు. అధిక ధరలను మద్యాన్ని విక్రయించే దుకాణాల ఉద్యోగులపై కేసులు నమోదు చేశామన్నారు. మద్యం డిపోలు, తయారీ డిస్టీలరీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామన్నారు.

1.72 లక్షలు సీజ్‌

కామవరపుకోట, మే 2 : కొత్తూరు ఎన్నికల చెక్‌పోస్టు వద్ద గురువారం వాహన తనిఖీలలో జంగారెడ్డిగూడేనికి చెందిన కారులో ఎటువంటి పత్రాలు లేకుండా తీసుకు వెళుతున్న వ్యక్తి నుంచి లక్షా 72 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల అధికారి ఎండీ మొహిద్దీన్‌ తెలి పారు.ఏలూరు ఎన్నికల ట్రెజరీకు పంపామని చెప్పారు. వీఆర్వో కొయ్యగూర బాబూరావు, పోలీసులు కె.రమేష్‌, కె.రామకృష్ణ, సూర్యారావు, షేక్‌ నాగూర్‌, నాగార్జున ఉన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:13 AM