Share News

ప్రచారానికి వడ దెబ్బ

ABN , Publish Date - May 03 , 2024 | 12:18 AM

ఒకపక్క ఎన్నికల వేడి.. మరోపక్క వేసవి ఎండలు మండిపోతున్నాయి. పది దాటితే వాతావరణం నిప్పుల కొలిమిలా తయారవు తోంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటే నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం లేదు. ఎండలను లెక్క చేయకుండా ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొందరు నాయకులు అస్వస్తతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.

ప్రచారానికి వడ దెబ్బ
పాలకొల్లు మండలం పెదమామిడిపల్లిలో కల్లుగీత కార్మికుడు కల్లు అందించగా సేవిస్తున్న టీడీపీ అభ్యర్థి నిమ్మల


మండుతున్న ఎండలు

అస్వస్థతకు గురవుతున్న

నాయకులు, కార్యకర్తలు

ఉదయం, సాయంత్రమే ప్రచారం

గణపవరం, మే 2: ఒకపక్క ఎన్నికల వేడి.. మరోపక్క వేసవి ఎండలు మండిపోతున్నాయి. పది దాటితే వాతావరణం నిప్పుల కొలిమిలా తయారవు తోంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లాలంటే నాయకులు, కార్యకర్తలు ముందుకు రావడం లేదు. దీంతో గ్రామాల్లో గతంలో ఉన్నంత ఊపు, ఉత్సాహం ఈ ఎన్నికల్లో కనిపించడం లేదు. ఎండలను లెక్క చేయకుండా ఇటీవల ఎన్నికల ప్రచారం నిర్వహించిన కొందరు నాయకులు అస్వస్తతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. దీంతో ఉదయం, సాయంత్ర సమయాల్లో ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. రోడ్‌ షోలు, కార్నర్‌ మీటింగులు కూడా అదే సమయంలో నిర్వహిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రచార కార్యక్రమాలు నిలుపుదల చేస్తున్నారు. ఆ సమయంలో హాలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రత గుర్తించి ప్రధాన పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నారు. వడదెబ్బ తగిలితే తమకు ఎవరు అండగా ఉంటారని అక్కడడక్కడా కొందరూ కార్య కర్తలు నిలదీస్తుండడంతో పార్టీలు కూడా వారి అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకుంటున్నాయి.

అప్పటి జోష్‌ ఏది ?

గత ఎన్నికల్లో పోలిస్తే ఈ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీల నాయకులు, కార్యకర్తలో ఆ ఉత్సాహం, సందడి కనిపించడం లేదు. పార్టీ అభ్యర్థులు, ముఖ్య నేతలు వచ్చినప్పుడు మాత్రమే నాయకులు, కార్య కర్తలు కనిపిస్తున్నారు. నాయకుల ఎదుట కనిపించే ఎన్నికల ప్రచార సందడి వారు వెళ్లిపోయాక కనబడకకుండా పోతుంది. ఈ తీరు ప్రధాన పార్టీల్లో కనిపిస్తోంది. ఇంతకు ముందు ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే గ్రామాల్లో పట్టణాల్లో రాజకీయ సందడి కనిపించేది. ఎక్కడ నలుగురు కలిసినా రాజ కీయ పార్టీలు, అభ్యర్థుల గురించి చర్చ జరిగేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. తమను పలక రించకపోయినా, తక్కువ చేస్తున్నట్లు అనిపించినా అలిగి ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ఇటువంటి వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం నాయకులకు సవాలుగా మారింది.

ఆసక్తి చూపని కార్యకర్తలు

ముఖ్యనేతలు బతిమాలితేనే నాయకులు, కార్య కర్తలు ప్రచారానికి వస్తున్నారు. గత ఎన్నికల్లో అభ్య ర్థులు, నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ఓట్లు వేయ్యాలని ఓట్లు అభ్యర్థించేవారు. ఇప్పుడు ఉదయం సాయంత్రం వేళల్లో నిర్వహించే ప్రచారంతో ఎక్కువ మందిని కలవలేకపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచి పట్టణాలు, గ్రామాల్లోకి ప్రచార రథాలు వస్తున్నా జనం అంతగా ఆసక్తి కనపరచడం లేదు. ఇంతకు ముందు తమ గ్రామాలకు ఎన్నికల ప్రచార వాహనలు వస్తే ప్రజలు ఎంతో ఆసక్తిగా గమనించే వారు. మైకుల్లో రికార్డు చేసిన ప్రసంగాలు వినేవారు. ఏ పార్టీ ఏం చెబుతుందనేది గుర్తించేవారు. పార్టీలు చెప్పే అంశాలు, హామీల పైన చర్చ చేసేవారు. ఈ ఎన్నికల్లో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పాటలు పాడుతూ ప్రదర్శనలు ఇస్తున్న ప్రజలు అంత ఆసక్తి చూపడం లేదు.

Updated Date - May 03 , 2024 | 12:18 AM