ఈ –క్రాప్ బుకింగ్.. అన్నీ సమస్యలే!
ABN , Publish Date - Sep 10 , 2024 | 12:46 AM
వ్యవసాయానికి సంబంధించి పంట పండించడంతో పాటు ధాన్యం కొను గోలు, ఇతర ప్రయోజనాలు పొందడా నికి రైతులు తప్పనిసరిగా ఈ –క్రాప్ నమోదు చేయించుకోవాలి.
మొరాయిస్తున్న సర్వర్
జిల్లాలో ఇప్పటివరకు 75.9 శాతం పూర్తి
ఏలూరు సిటీ, సెప్టెంబరు 9 : వ్యవసాయానికి సంబంధించి పంట పండించడంతో పాటు ధాన్యం కొను గోలు, ఇతర ప్రయోజనాలు పొందడా నికి రైతులు తప్పనిసరిగా ఈ –క్రాప్ నమోదు చేయించుకోవాలి. అయితే సవాలక్ష సమస్యలతో ఈ–క్రాప్ బుకిం గ్ ఆలస్యం అవుతోందని, ప్రతిసారి సర్వర్ సమస్యలతో పాటు ఇతర సమస్యలతో ఈ–క్రాప్ బుకింగ్‌లో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి వరి, పత్తి పంటలు సాగు చేసిన రైతులు ఈ–క్రాప్ బుకింగ్ చేయించుకుంటున్నారు. ఈ–క్రాప్ బుకింగ్‌ను సాగుచేసే అన్ని పంటలకు చేయించాల్సి ఉంది. అయితే కొన్ని సమస్యలతో ఈ –క్రాప్ బుకింగ్ ఆలస్యం అవుతోందని రైతులు చెబుతు న్నారు. సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా ఈ–క్రాప్ నమోదు లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. జిల్లాలో ఖరీఫ్ పంట లకు సంబంధించి వరి, పత్తి పంటల సాగు జరుగుతోంది. మొత్తం 1,74, 412ఎకరాలకు సంబంధించి ఇప్పటివరకు 1,32,373.3 ఎకరాల్లోని పంట లకు (75.9 శాతం) ఈ–క్రాప్ నమోదు పూర్తయిందని జిల్లా వ్యవసాయ శాఖాధికారుల నివేదికలు చెబుతున్నాయి. ఖరీఫ్ వరి పంటకు సంబం ధించి జిల్లాలో 1,69174 ఎకరాల్లో సాగు చేయగా ఇప్పటివరకు 1,30, 567.9 ఎకరాలకు (77.2 శాతం) సంబంధించి ఈ–క్రాప్ నమోదు పూర్త యింది. ప్రధానంగా టి.నరసాపురం మండలంలో అత్యధికంగా 98.9 శాతం, కుక్కునూరు మండలంలో అత్యల్పంగా 5.3 శాతం పూర్తయింది. మండలాల వారీగా ఉంగుటూరులో 58.2, చింతలపూడి 61.6, లింగ పాలెం 63.4, పెదవేగిలో 66.5, ద్వారకా తిరుమల 66.8, కైకలూరు 78.2, కొయ్యలగూడెం 78.4, దెందులూరు 78.7, మండవల్లి 79.6, కలిదిండి 81.2, వేలేరుపాడు 88.2, ముదినేపల్లి 82.8, పెదపాడు 83.5, ముసు నూరు 86.3, జంగారెడ్డిగూడెం 83.7, భీమడోలు 84.2, నూజివీడు 88.7, నిడమర్రు 85.6, చాట్రాయి 88.7, పోలవరం 88.8, ఏలూరు 89.7, టి.నరసాపురం 98.9, కామవరపుకోట 94.8, జీలుగుమిల్లి 97.5, ఆగిరిపల్లి 97.2, బుట్టాయిగూడెం 97శాతం ఈ –క్రాప్ బుకింగ్ నమోదు జరిగింది. పత్తి పంటకు సంబంధించి జిల్లాలో 5238 ఎకరాల్లో సాగు చేయగా ఇంతవరకు 1805.4 ఎకరాలకు సంబంధించి 34.47 శాతం ఈ–క్రాప్ బుకింగ్ పూర్తయింది. జిల్లాలో అత్యధికంగా జంగారెడ్డిగూడెంలో 100.3 శాతం, అత్యల్పంగా కుక్కునూరు మండలంలో 12.3 శాతం ఈ–క్రాప్ బుకింగ్ నమోదైంది. సాగులేక పోవడంతో 11 మండలాల్లో ఈ–క్రాప్ బుకింగ్ జరగలేదు. మిగిలిన మండలాల్లో పరిశీలిస్తే చింతలపూడి 85.9, లింగపాలెం 39.8, పెదవేగి 63.3, ద్వారకా తిరుమల 62.5, దెందులూరు 88.5, వేలేరుపాడు 74.5, ముసునూరు 36.6, జంగారెడ్డిగూడెం 100.3, నూజివీడు 42.7, చాట్రాయి 61.4, పోలవరం 79.1, కామవరపుకోట 96.7, జీలుగుమిల్లి 88.7, ఆగిరిపల్లి 87.3, బుట్టాయిగూడెం 98.5 శాతం ఈ–క్రాప్ నమోదు పూర్తయింది. ఈనెల 15వ తేదీలోగా ఈ–క్రాప్ నమోదు పూర్తి చేయాల్సి ఉంది.