Share News

ఇదేమిటి..స్వామీ!

ABN , Publish Date - May 03 , 2024 | 12:32 AM

భద్రతా చర్యల సాకుతో ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని తూర్పురాజగోపురం మినహా అన్ని గోపురాల దారులు మూసి వేయడంతో భక్తులతో పాటు ఆలయ సిబ్బంది, గ్రామస్థులు ఇబ్బం దులు పడుతున్నారు.

ఇదేమిటి..స్వామీ!
గేట్లు మూసిఉన్న పాత కేశఖండనశాల వద్ద ఉన్న నల్లమెట్ల దారి

తూర్పుగోపురం మినహా.. అన్నిదారులు మూసివేత

భద్రతా చర్యలంటున్న అధికారులు..

ద్వారకా తిరుమలలో ఇబ్బందులు పడుతున్న భక్తులు, స్థానికులు

ద్వారకా తిరుమల, మే 2: భద్రతా చర్యల సాకుతో ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని తూర్పురాజగోపురం మినహా అన్ని గోపురాల దారులు మూసి వేయడంతో భక్తులతో పాటు ఆలయ సిబ్బంది, గ్రామస్థులు ఇబ్బం దులు పడుతున్నారు. సింగిల్‌ ఎంట్రీ, సింగిల్‌ ఎక్జిట్‌ పేరుతో తీసుకున్న ఈచర్యలు ఎవరికీ మింగుడు పడడం లేదు. ఇప్పటి వరకు భక్తులు, సిబ్బంది ఆలయంలోకి ప్రవేశించాలంటే తూర్పు రాజగోపురం నుంచే కాకుండా పాత కేశఖండన శాల వద్ద ఆలయ పడమర రాజగోపురం వైపు నున్న నల్లరాతి మెట్లు మార్గం, శివాలయానికి వెళ్లే మెట్ల మార్గం, హరిణి కల్యాణ మండపం వద్ద మెట్ల మార్గం వాడుకలో ఉండేవి. దీంతో అందరికీ వెసులు బాటుగా ఉండేది. అయితే తాజాగా ఆలయ భద్రతా చర్యలు అంటూ ఈ మార్గాలన్నీ మూసి వేయడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై ఆలయ ఈఓ త్రినాథరావు మాట్లాడుతూ సెక్యూరిటీ ఆడిట్‌లో దేవాలయ భద్రత దృష్ట్యా చేసిన సూచనల ప్రకారమే ప్రస్తుత చర్యలు తీసుకున్నామన్నారు.

Updated Date - May 03 , 2024 | 12:34 AM