Share News

వైభవంగా వసంతోత్సవం

ABN , Publish Date - May 25 , 2024 | 11:45 PM

రాజాధిరాజ వాహనంపై రాజసంగా ఉభయ దేవేరులతో ఆశీనులైన చిన్నతిరుమలేశుడు తిరువీధుల్లో భక్తజనులపై వసంతాలు కురిపించారు.

వైభవంగా వసంతోత్సవం
తిరువీథుల్లో భక్తులపై వసంతాలు జల్లుతున్న అర్చకులు

ముగిసిన వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు

ద్వారకా తిరుమల, మే 25: రాజాధిరాజ వాహనంపై రాజసంగా ఉభయ దేవేరులతో ఆశీనులైన చిన్నతిరుమలేశుడు తిరువీధుల్లో భక్తజనులపై వసంతాలు కురిపించారు. శ్రీవారి వైశాఖమాస బ్రహ్మోత్సవాలు శనివారం రాత్రి వరకూ జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిశాయి. ఉదయం పాదుకా మండపం వద్దనున్న పాత కల్యాణమండప ఆవరణలో జరిగిన చూర్ణో త్సవం, వసంతోత్సవం భక్తులకు కన్నులపండువయ్యాయి. కల్యాణ మూర్తు లను రాజాధిరాజ వాహనంలో ఉంచి గ్రామంలో ఊరేగించారు. చూర్ణో త్సవం, వసంతోత్సవాలు జరిపారు. రాత్రి ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి ద్వాదశకోవెల ప్రదక్షిణలు. శ్రీపుష్పయాగోత్సవం వేడుకగా జరిపారు.

శయన మహావిష్ణువుగా శ్రీవారు

ఆదిశేషుని పాన్పుగా చేసుకుని పవళించిన శ్రీమహావిష్ణువుకు శ్రీదేవి, భూదేవిలు సేవలు చేస్తున్నట్లున్న శయన మహావిష్ణువు అలంకరణలో చిన వెంకన్న శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. వైశాఖమాస బ్రహ్మోత్సవాల్లో ప్రతీరోజూ జరుగుతున్న అలంకార మహోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. శయన మహావిష్ణువుగా ఉన్న స్వామిని భక్తులు దర్శించి తరించారు.

శ్రీవారి క్షేత్రం..భక్త జనమయం

గోవిందా...గోవిందా..అంటూ భక్తులు చిన్నతిరుమల క్షేత్రానికి శనివారం విచ్చేశారు. దాదాపు 20 వేలకు పైబడి భక్తులు స్వామివారిని దర్శించు కున్నారు. ఆలయంలోని అన్ని విభాగాలు భక్తజనులతో సందడిగా మారాయి. శ్రీవారి ఉచిత దర్శనానికి 3 గంటల పైబడి సమయం పట్టింది. దర్శనా నంతరం భక్తులు శ్రీవారి ఉచిత అన్నప్రసాదం స్వీకరించారు.

Updated Date - May 25 , 2024 | 11:45 PM