Share News

రూ.లక్ష విలువైన అక్రమ మద్యం ధ్వంసం

ABN , Publish Date - Mar 16 , 2024 | 12:27 AM

భీమడోలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయం సమీపంలో ఇటీవల వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న లక్షా ఐదు వేల విలువైన మద్యం, నాటు సారాలను అధికారులు ధ్వంసం చేశారు.

రూ.లక్ష విలువైన అక్రమ మద్యం ధ్వంసం
భీమడోలులో అక్రమ మద్యాన్ని పారబోస్తున్న అధికారులు

భీమడోలు, మార్చి 15 :భీమడోలు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కార్యాలయం సమీపంలో ఇటీవల వివిధ ప్రాంతాల్లో జరిగిన తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న లక్షా ఐదు వేల విలువైన మద్యం, నాటు సారాలను అధికారులు ధ్వంసం చేశారు. ఏలూరు ఎస్‌ఈబీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సూపరింటెండెంట్‌ రామకృష్ణ సమక్షంలో ఎస్‌ఈబీ డిప్యూటీ కమిషనర్‌ ఉత్తర్వుల మేరకు వివిధ కేసుల్లో పట్టుబడిన 240 లీటర్ల నాటుసారా, 482 మద్యం సీసాలు, ఎన్‌డీపీఎల్‌ కోసం సుంకం చెల్లించని 84 మద్యం సీసాలను ధ్వంసం చేశారు. భీమడోలు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ ఇన్‌స్పెక్టర్‌ గిరిజకుమారి సిబ్బందితో ఇటీవల దోరసానిపాడు, తిరుమలపాలెం, జి.కొత్తపల్లి గ్రామాల్లో విస్తృత దాడులు జరిపి అక్రమ మద్యంపై కేసులు నమోదుచేశారు. ఏలూరు జిల్లా సమీపంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టుల్లోను పోలీసుల సహకారంతో తనిఖీలు నిర్వహించి మద్యం స్వాధీనం చేసుకున్నామని ఇన్‌స్పెక్టర్‌ గిరిజ కుమారి తెలిపారు. అక్రమ మద్యంపై ఎటు వంటి సమాచారం ఉన్నా 94409 02434, 94409 02429 నెంబర్లకు సమాచారం అందించాలని కుమారి కోరారు.

Updated Date - Mar 16 , 2024 | 12:27 AM