Share News

అవగాహనతోనే వ్యాధులు దూరం

ABN , Publish Date - Apr 20 , 2024 | 12:37 AM

దోమల వ్యాప్తితోనే సకల వ్యాధులు ప్రభలుతా యని, అవగాహనతోనే వ్యాధులను దూరం చేసుకోవచ్చని మలేరియా సహాయ అధికారి జె.గోవిందరావు అన్నారు.

అవగాహనతోనే వ్యాధులు దూరం
దోమల వ్యాప్తి అనర్ధాలపై అవగాహన కల్పిస్తున్న గోవిందరావు

మలేరియా సహాయ అధికారి గోవిందరావు

పెదవేగి, ఏప్రిల్‌ 19 : దోమల వ్యాప్తితోనే సకల వ్యాధులు ప్రభలుతా యని, అవగాహనతోనే వ్యాధులను దూరం చేసుకోవచ్చని మలేరియా సహాయ అధికారి జె.గోవిందరావు అన్నారు. పినకడిమిలో శుక్రవారం డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. వీధుల్లో పర్యటించి, మహిళలకు పారిశుధ్య నిర్వహణ, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీటకాల్లో అత్యంత ప్రమాదకరమైనది దోమ అన్నారు. మనరక్తాన్ని తాగి, మనకు ప్రాణాంతకమైన వ్యాధులను సంక్రమింప చేస్తుందని ఆయన చెప్పారు. దోమల నిర్మూలన ఒక సామాజిక బాధ్యతగా తీసుకుని, ప్రతిఒక్కరూ దోమల నిర్మూలనపై ప్రత్యేకదృష్టి పెట్టాలని ఆయన సూచించారు. ఇంటి ఆవరణలో తొట్టెలు, డ్రమ్ములు, పూలకుండీలు, వాడి పడేసిన టైర్లు, ప్లాస్టిక్‌ గ్లాసులు వంటి వాటిల్లో దోమలు పెరుగుతాయన్నారు. వారానికోసారైనా తొట్టెలను శుభ్రపర్చాలని, వాడని వస్తువులను బోర్లించాలని తెలిపారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ ప్రియదర్శిని, హెల్త్‌ అసిస్టెంట్లు వి.కిశోర్‌, ఎం.శ్రీనివాసరావు, ఆరోగ్య కార్యకర్త వెంకటేశ్వరమ్మ, ఆశాకార్యకర్త పద్మ పాల్గొన్నారు.

Updated Date - Apr 20 , 2024 | 12:37 AM