Share News

పచ్చదనం మాటున ప్రమాదం

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:12 AM

పచ్చదనానికి పెద్దపీఠ వేద్దాం, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి, దానిని సంరక్షించండి పర్యావరణాన్ని పరిరక్షించండి ఇవి పాలకులు, అధికారులు నిరంతరం చెప్పే మాటలు. అందులో భాగంగా ఏలూరు, రూరల్‌ ప్రాంతాల్లో డివైడర్‌ల మధ్య, ఆర్‌అండ్‌బీ రహదారులు ఇరువైపులా అందంగా కనిపించేందుకు ఫోనో కార్పస్‌ (దుబాయ్‌) మొక్కలు వేశారు, వేస్తున్నారు.

పచ్చదనం మాటున ప్రమాదం
ఏలూరులో డివైడర్‌కి మఽధ్యన ఉన్న ఫోనో కార్పస్‌ మొక్కలు

డివైడర్‌ల మధ్య ప్రమాదకర ఫోనోకార్పస్‌ చెట్లు

వీటితో ప్రమాదమని హెచ్చరికలు

ఏలూరు రూరల్‌, జూలై 27: పచ్చదనానికి పెద్దపీఠ వేద్దాం, ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి, దానిని సంరక్షించండి పర్యావరణాన్ని పరిరక్షించండి ఇవి పాలకులు, అధికారులు నిరంతరం చెప్పే మాటలు. అందులో భాగంగా ఏలూరు, రూరల్‌ ప్రాంతాల్లో డివైడర్‌ల మధ్య, ఆర్‌అండ్‌బీ రహదారులు ఇరువైపులా అందంగా కనిపించేందుకు ఫోనో కార్పస్‌ (దుబాయ్‌) మొక్కలు వేశారు, వేస్తున్నారు. అయితే వీటితో ప్రమాదం అని ఇటీవల అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఈ మొక్కలు నర్సరీల్లో పెంచవచ్చని, ఎక్కడా వాటిని వేయవద్దని ఫోనో కార్పస్‌ మొక్కల పెంపకం పై ఏర్పడే అనర్ధాలను వివరిస్తూ ఇతర రాష్ర్టాలు నిర్ణయాలు తీసుకున్నాయి. రాష్ట్రంలో కూడా ఫోనో కార్పస్‌ మొక్కలను తొలగిస్తున్నారు. అయితే ఏలూరు, రూరల్‌ గ్రామాల్లో ఈ మొక్కలు డివైడర్‌ల మధ్య దర్శనమిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, అందులో ఎటువంటి సందేహం లేదు. పచ్చదనం పేరుతో ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం సరికాదు. దుబాయ్‌, పాకిస్తాన్‌, ఆఫ్రి కా దేశాల్లో విరివిగా పెంచే ఈ మొక్కలు పలు దేశాలు నిషేదించాయి. ఈ మొక్కలు క్రమేణా పెరిగి భూమిలోకి అత్యంత దూరం వేళ్ళుపాకుతూ నీటి వనరులను హరించి వేస్తాయి. వర్షాభావ పరిస్థితులకు కారణమవుతాయి. ఈ క్రమంలో పలు కథనాలు వెలువడిన నేపథ్యంలో ఇటు ఆంధ్రప్రదేశ్‌లో చర్చ మొదలైంది. ఈ మొక్కలను తెలంగాణ రాష్ట్రం పెంచడం లేదు. శ్వాసకోస వ్యాధులకు కారకాలుగా మారతాయనే ఉత్తర్వులు ఉన్నాయి. వేగంగా పెరిగే ఈ చెట్టు అందంగా ఉన్న పర్యావరణానికి పెనుప్రమాదంగా మారతుంది. ఈ మొక్కను రహదారులు, కమ్యూనిటీ అవెన్యూ, ప్లానిటేషన్‌ లో పెంచుతున్నారు. అయితే ఫోనో కార్పస్‌ మొక్క పర్యావరణానికి హాని చేయడంతో పాటు ప్రజారోగ్య సమస్యలకు కారణమవుతుంది. గాలిలో ఎక్కు వ సంఖ్యలో పుప్పొడి రేణువులు కనిపించటం అది ఖోఖో కార్పస్‌ పుష్పా లివిగా తెలియడంతో ఇవి పర్యావరణ చేటు అని పర్యావరణ వేత్తలు పేర్కొం టున్నారు. ఈ చెట్టు పెంచితే ప్రాణాలకే ముప్పు అని తెలుపుతు న్నారు. ఈ చెట్ల పై కనీసం పిట్టవాలదు కదా మేకలు, గొర్రెలు కూడా వీటి ఆహారంగా తినవు. తక్షణం ఈ మొక్కలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:17 AM