కౌంటింగ్.. కౌంట్‌డౌన్
ABN , Publish Date - May 26 , 2024 | 12:16 AM
ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 10 రోజులలో ఫలితా లు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్, ఫలితాల లెక్కింపు కోసం అధికారుల్లో అటెన్షన్ నెలకొంది.
అందరి దృష్టి జిల్లా ఫలితాలపైనే..
అభ్యర్థులలో టెన్షన్.. అధికారుల అటెన్షన్
భీమవరంలో ఓట్ల లెక్కింపు
విష్ణులో తణుకు, ఆచంట, పాలకొల్లు, నర్సాపురం
ఎస్‌ఆర్‌కేఆర్‌లో భీమవరం, తాడేపల్లిగూడెం, ఉండి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ఎన్నికల ఫలితాలకు కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 10 రోజులలో ఫలితా లు వెలువడనున్నాయి. రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్, ఫలితాల లెక్కింపు కోసం అధికారుల్లో అటెన్షన్ నెలకొంది. నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మే 13న పోలింగ్ జరిగింది. జూన్ నాలుగో తేదీన ఓట్ల్లను లెక్కించనున్నారు. ఇందుకు భీమవరంలోని రెండు కళాశాలల్లో ఈవీఎం యంత్రాలను భద్రపరిచారు. ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియో జకవర్గాల ఓట్లను లెక్కిస్తారు. విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఆచంట, పాలకొల్లు, తణుకు, నరసాపురం నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జరుగు తుంది. ఇప్పటికే ఈవీఎం యంత్రాలను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచి, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం కొత్తగా ముగ్గురు పోలీస్ అధికారులను నియమించారు.
ఎన్నికల ఫలితాల కోసం జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా రు. జిల్లా ఎటు వైపు ఉంటే రాష్ట్రంలో ఆ పార్టీయే అధికారం చేజిక్కించుకుం టుందని సెంటిమెంట్ ఉంది. ఇప్పటి వరకు ఇదే జరిగింది. నర్సాపురం పార్లమెంట్‌లో నెగ్గిన పార్టీ లేదా కూటమి రాష్ట్రంలో అధికారం చేజిక్కించు కుంది. దీంతో అందరి దృష్టి జిల్లాపై పడింది. జిల్లాలో కూటమి తరపున టీడీపీ నాలుగుచోట్ల జనసేన మూడుచోట్ల పోటీపడ్డాయి. నర్సాపురం పార్ల మెంట్‌లో బీజేపీ తలపడింది. మూడు పార్టీల ఓట్లు పరస్పరం బదిలీ అయ్యాయి. ప్రతీ నియోజకవర్గంలోనూ శ్రేణులు కలసికట్టుగా పనిచేశాయి. విజయంపై కూటమి నాయకులు ఽధీమాతో ఉన్నారు. ఈ విషయంలో వైసీపీలోనే అలజడి నెలకొంది. పార్టీ శ్రేణులు ఢీలాపడ్డాయి. జిల్లాలో ఫలితా లు ఎలా ఉన్నా రాష్ట్రంలో తమదే అధికారం అంటూ గాంభీర్యం ప్రదర్శిస్తోం ది. జిల్లా ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
భద్రతపై దృష్టి పెట్టిన యంత్రాంగం
జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇతర జిల్లాల్లో ఎన్నికల తర్వాత శాంతి భద్రతలకు విఘాతం కలగడంతో ఆ ప్రభావం పశ్చిమ పైనా పడింది. రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఫలితాల రోజున ఉద్రిక్త పరిస్థితు లు తలెత్తకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ముందుగానే పట్ట ణాల వారీగా మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల కోసం తరలివచ్చిన కేంద్ర బలగాలు జిల్లాలో వున్నాయి. ఫలితాలు ప్రకటించిన రెండు, మూడు రోజుల వరకు ఇవి ఇక్కడే ఉంటాయి. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలకు అధికారులు సిద్ధమ య్యారు. ఫలితాల అనంతరం గెలుపొందిన పార్టీ శ్రేణులు వేడుకలకు దూరంగా ఉండాల్సిందే. ర్యాలీలు, బాణసంచాలను పేల్చడం వంటి వాటిని నిర్వహించకూడదని అధికారులు ఆదేశాలు జారీచేశారు. మరోవైపు జిల్లాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ వున్నారు. ఫలితాల రోజున జిల్లాను తమ గుప్పిటలో పెట్టుకునేలా ముందస్తు చర్యలు తీసుకుంటుంది.
పోస్టల్ బ్యాలెట్‌లతో సమానంగా..
ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ మొదలవు తుంది. మరో పావు గంటకు ఈవీఎంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమవు తుంది. ఈ సారి బ్యాలెట్ ఓట్లు అధికంగా పోలయ్యాయి. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగులతోపాటు, వివిధ సంస్థల ఉద్యోగులు, జర్నలిస్టు లు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. వీరితోపాటు 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దనే ఓట్లు వేయించుకున్నారు. వీరంతా దాదాపు 37 వేల మంది వరకు ఉన్నారు. ఇవన్నీ లెక్కించిన తరువాతే ఈవీ ఎం మిషన్‌లలో ఓట్లు లెక్కిస్తారు. ఫలితంగా తొలి రౌండ్ ఫలితాలు వచ్చే సరికి జాప్యం జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
తొలి ఫలితం నరసాపురం.. చివరిది భీమవరం
జిల్లాలో నరసాపురం నియోజకవర్గంలో తొలి ఫలితం వెలువడనుండగా.. ఆలస్యంగా భీమవరం ఫలితం రానుంది. నరసాపురంలో తక్కువ మంది ఓటర్లు ఉండడంతో 12 రౌండ్లలోనే లెక్కింపు ముగుస్తుంది. తర్వాత ఆచంట 13, పాలకొల్లు 14, తాడేపల్లిగూడెం, తణుకు, ఉండి 15, భీమవ రం నియోజవర్గంలో 17 రౌండ్లలో ఓట్ల లెక్కింపు చేపడతారు.