Share News

వంట నూనెలు సలసల!

ABN , Publish Date - Sep 17 , 2024 | 12:30 AM

వంటనూనెలు సలసల కాగుతున్నాయి. ఆ వేడిలో సామాన్యుడు విలవిలాడుతున్నాడు. శనివారం నుంచి వంటనూనె లీటరు ధర రూ.20ల వరకు పెరిగింది.

వంట నూనెలు సలసల!

ఏలూరు టూటౌన్‌, సెప్టెంబరు 16 : వంటనూనెలు సలసల కాగుతున్నాయి. ఆ వేడిలో సామాన్యుడు విలవిలాడుతున్నాడు. శనివారం నుంచి వంటనూనె లీటరు ధర రూ.20ల వరకు పెరిగింది. పామాయిల్‌, సన్‌ఫ్లవర్‌ నూనె, సోయానూనె ధరలు పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం వంటనూనెలపై దిగుమతి సుంకం పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఆ మరుక్షణమే రిటైల్‌ వినియోగదారులు లీటరుకు రూ.20 పెంచేశారు. దిగుమతి సుంకానికి అదనంగా 5శాతం స్టాండెడ్‌ సెస్‌, 10శాతం అగ్రికల్చర్‌ సెస్‌ యాడ్‌ అవుతుంది. సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రూ.115 నుంచి 130 వరకు పెరిగింది. చిల్లర దుకాణాల్లో ఇంకో ఐదు రూపాయలు ఎక్కువగానే అమ్ముతున్నారు. పామాయిల్‌ ధర రూ.95 – 110కు పెరిగింది. వేరుశనగ రూ.145 నుంచి రూ.154 పెరిగింది. దీపారాధన ఆయిల్‌ రూ.108 నుంచి 121కి పెరి గింది. సన్‌ఫ్లవర్‌ 15 కేజీల టిన్‌ రూ.1,750 నుంచి రూ.2వేలకు ఎగబాకింది. పామాయిల్‌ డబ్బా రూ.1,520 నుంచి 1,720కు పెరిగింది. రైస్‌బ్రాన్‌ ఆయిల్‌ రూ.120 – 130కి పెరిగింది. ఒక్కసారిగా ధర పెరగడంతో వినియోగదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దిగుమతి సుంకం పెంచడంతో దళారులు రంగంలోకి దిగారు. ఉన్న ఆయిల్‌ను గొడౌన్స్‌లో నిల్వ చేసి కృత్రిమ కొరత సృష్టించి ఇంకా ధరలు పెంచేందుకు పన్నా గాలు పన్నుతున్నారు. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం నిర్వా కంతో అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగాయి. నిత్యావసర సరు కులు, పెట్రోలు, డీజిల్‌, గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరి గాయి. మరోవైపు తాజాగా వరదల కారణంగా కూరగాయల పంటలు దెబ్బతిని కూరగాయల రేట్లు పెరిగాయి. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా వంటనూనెల పై దిగుమతి సుంకం పెంచడంతో సామాన్యులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు.

పండగల వేళ భయపెడుతున్న ధరలు

పండుగల సమయంలో వంటనూనె ధరలు పెరగడంతో వినియోగదారులు భయపడుతున్నారు. వినాయకచవితి పండు గను మొదలుకుని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ వరకు చాలా పండుగలున్నాయి. వచ్చే నెలలో దసరా, ఆపై దీపావళి, క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నూనెధరలు మరింత పెరుగతాయని ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు. వంటనూనె ధరలు పెరగడం వల్ల ఇతర ఆహార పదార్థాల ధరల వల్ల పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించి ప్రజలపై భారా లు వేయకుండా చూడాలని, బ్లాక్‌ మార్కెటింగ్‌ ద్వారా గొడౌన్ల లో దాచిన వంట నూనెలను బయటకు తీసుకొస్తే రేట్లు పెరు గుదలను నివారించవచ్చని వినియోగదారులు కోరుతున్నారు.

వ్యాపారం త గ్గే అవకాశం ..

కేంద్రం దిగుమతి సుంకం పెంచడం తో వంటనూనెల ధరలు పెరిగాయి. ఈ విషయం సామాన్యులకు అర్థంకాదు. ధరలు మేమే పెంచినట్టు ఆలోచించి పక్కషాపునకు వెళ్లి కొనుక్కుం టారు. దీంతో వ్యాపారం తగ్గే అవకాశం ఉంది. కొవిడ్‌ అనం తరం వ్యాపారం సరిగ్గా నడవక మూడేళ్ల నుంచి నష్టాల్లో ఉన్నాం. అటు వినియోగదారునికి, వ్యాపారులకు దరల పెరుగుదల నష్టమే.

– వాసు, రిటైల్‌ వ్యాపారి

ధరల పెరుగుదలతో సతమతం

ఇప్పటికే అన్ని రకాల ధరలు పెరిగాయి. నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితుల్లో ఉన్నాం. గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే బతుకు దెరువు కష్టంగా ఉంది. మరలా మంటనూనె ధరల పెరగడం సామాన్యుడి పై పెనుభారమే. నూనె ధరలు పెరగటం వలన మిగిలిన ఆహార వస్తువుల ధరలన్ని పెరుగుతాయి. మేము బతికేది ఎలా..?. వంటనూనె ధరలు తగ్గించాలి.

– సయ్యద్‌ అన్వర్‌, వినియోగదారుడు

Updated Date - Sep 17 , 2024 | 12:30 AM