సీడీపీవో లైంగిక వేధింపులపై ఫిర్యాదు
ABN , Publish Date - Feb 06 , 2024 | 12:48 AM
సీడీపీవో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని అంగన్‌వాడీ టీచర్ పోలీసులను ఆశ్రయించిన ఉదంతమిది.
ముదినేపల్లి రూరల్, ఫిబ్రవరి 5: సీడీపీవో తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని అంగన్‌వాడీ టీచర్ పోలీసులను ఆశ్రయించిన ఉదంతమిది. ముదినేపల్లి పోలీసుల వివరాల ప్రకారం ముదినేపల్లి మండలం వి. రావి గుంటకు చెందిన అంగన్‌వాడీ కేంద్రం టీచర్ చిన్నం నిరోషా తాను సక్రమంగా విధులు నిర్వహిస్తున్నా కైకలూరు సీడీపీవో ఆనంద్‌కుమార్ తాను సక్రమంగా విధులు నిర్వహించటం లేదని, రికార్డులు పొందుపరచటంలో అలసత్వం వహిస్తున్నానని వేధిస్తున్నాడని, తన పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట కుమార్ తెలిపారు.