Share News

హరివిల్లు

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:13 AM

గొబ్బెమ్మలు, బంతిపువ్వులు, రంగవల్లులు, రంగులతో అలంకరిం చిన ముత్యాల ముగ్గులతో జంగారెడ్డిగూడెంలో సంక్రాంతి పండుగ వాతావారణం ముందుగానే కన్పించింది.

హరివిల్లు
జంగారెడ్డిగూడెంలో ముగ్గులు వేస్తున్న మహిళలు

మహిళల నుంచి విశేష స్పందన

జంగారెడ్డిగూడెం, జనవరి 6 : గొబ్బెమ్మలు, బంతిపువ్వులు, రంగవల్లులు, రంగులతో అలంకరిం చిన ముత్యాల ముగ్గులతో జంగారెడ్డిగూడెంలో సంక్రాంతి పండుగ వాతావారణం ముందుగానే కన్పించింది. ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీలకు మహిళల నుంచి విశేష స్పందన లభించింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి – ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు.. రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’ సారఽథ్యంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ యువనేత బొమ్మాజీ అనిల్‌ సౌజన్యంతో జంగారెడ్డిగూడెం త్రివేణి ప్రసాద్‌ కళాశాల గ్రౌండ్‌లో శనివారం ముగ్గుల పోటీలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి మొత్తం 63 మంది పాల్గొన్నారు. .

ముగ్గుల పోటీలతో సంప్రదాయాల పరిరక్షణ

టీడీపీ యువనేత బొమ్మాజి అనిల్‌ మాట్లాడుతూ గతంలో సంవత్సరమంతా మహిళలు తమ ఇళ్ల ముందు ముగ్గులు వేసేవారు. నేటి పోటీ ప్రపంచంలో తమ పిల్లల చదువులు, ఉద్యోగాల్లో మహిళలు నిమగ్నమ వ్వడం వల్ల సంప్రదాయాలు కనుమరుగు అవుతున్నా యి. ఇటువంటి తరుణంలో ఏటా ముత్యాల ముగ్గులు పోటీలు నిర్వహిస్తూ సంక్రాంతి పండుగ విశిష్టతను, మన సంప్రదాయాలను గుర్తు చేస్తున్న ఏబీఎన్‌–ఆంధ్ర జ్యోతి సంస్థకు ప్రతీ ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాల న్నారు. టీడీపీ నేత గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీలతో సంక్రాంతి పండుగను ముందుగానే తీసుకొచ్చారన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకునేందుకు ఇటువంటి ముగ్గుల పోటీలు ఎంతగానో దోహదపడుతున్నాయన్నారు. త్రివేణి ప్రసాద్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ మన సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవడం, నేటి యువతకు వాటిని నేర్పించడంలో ఆంధ్రజ్యోతి సంస్థ చేస్తున్న విశేష కృషి అభినందనీయమన్నారు. ఆంధ్రజ్యోతి బ్రాంచ్‌ మేనేజర్‌ బి.హరిబాబు మాట్లాడుతూ మహిళ ల్లోని నైపుణ్యతను వెలికితీయడానికి ఇటువంటి పోటీలు దోహద పడతాయ న్నారు. కార్యక్ర మంలో కాంగ్రెస్‌ నాయకుడు జెట్టి గురునాథరావు, ఆంధ్రజ్యోతి ఎడిషన్‌ ఇన్‌చార్జ్‌ రామకృష్ణ, న్యూస్‌ నెట్‌వర్క్‌ కో ఆర్డినేటర్‌ జీవీఎస్‌ఎన్‌ రాజు, యాడ్స్‌ మేనేజర్‌ రాజు, తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల్లో మొదటి స్థానంలో జి.దుర్గాభవాని (రూ.6వేలు), డి.రేవతి ద్వితీయ స్థానంలో (రూ.4వేలు), తృతీయ స్థానంలో దిగమర్తి భాగ్యలక్ష్మి (రూ.3వేలు) నగదు బహుమతిని అందుకున్నారు. వీరికి టీడీపీ యువనేత బొమ్మాజి అనిల్‌, టీడీపీ నేత గోరుముచ్చు గోపాల్‌ యాదవ్‌, ముఖ్యులు నగదు బహుతులను అందజేశారు. న్యాయ నిర్ణేతలుగా పెనుమర్తి సీత, తలగారపు జ్యోతి, పగడం సౌభాగ్యవతి వ్యవహరించారు. మరో 10 కన్సొలేషన్‌ బహుమతులను అందజేశారు. ఎస్‌.అమిత, సోయం మాధురి, డి.వెంకటలక్ష్మి, సీహెచ్‌ శశికళ, ఎన్‌.లక్ష్మీప్రీతి, దొంతు వరలక్ష్మి, బొల్లుబోయిన మణి, వి.మంగ, పి.నాగశిరీష, వి.గాయత్రిలకు కన్సొ లేషన్‌ బహుమతులను అందజేశారు. విజేతలందరికీ మద్ది ఆంజనేయస్వామి ప్రసాదపు లడ్డూ, పసుపు, కుంకుమ, జాకెట్‌ ముక్క అందజేశారు.

పోటీతత్వం అలవడింది..

గత పదకొండేళ్లుగా వివిధ ప్రాంతాల్లో జరిగే ముగ్గుల పోటీల్లో పాల్గొంటున్నాను. ఏటా ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి నిర్వహించే ముగ్గుల పోటీల్లో పాల్గొనడం వల్ల పోటీతత్వం పెరిగింది. చుక్కలతో మన సంప్రదాయాలు, పండుగను చూపే విధంగా వేసిన నా ముగ్గు మొదటి స్థానాన్ని అందించింది.

– జి.దుర్గాభవాని, మొదటి బహుమతి విజేత

ఎంతో ప్రోత్సాహకరం

పండుగలు వస్తున్నాయంటే వివిధ క్రీడలు, కోడిపందేలకే పరిమితం కాకుండా ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి మహిళల కోసం నిర్వహించే ముత్యాల ముగ్గుల పోటీలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ముగ్గుల పోటీలో నాకు ద్వితీయ స్థానం లభించడం ఆనందంగా ఉంది.

– డి.రేవతి, ద్వితీయ బహుమతి విజేత

నైపుణ్యతకు పదును

ఏబీఎన్‌–ఆంధ్రజ్యోతి సంస్థ నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీల్లో ఐదోసారి పాల్గొన్నా. గతంలో కన్సొలేషన్‌ బహుమతితో వెనుదిరిగారు. గతేడాది, ఈ ఏడాది తృతీయ స్థానంలో నిలవడం ఎంతో ఆనం దంగా ఉంది. ప్రతీసారి నాలో నైపుణ్యత పెరుగుతోంది.

– డి.భాగ్యలక్ష్మి, తృతీయ బహుమతి విజేత

నేడు ఏలూరులో ముగ్గుల పోటీలు

ఏలూరు, జనవరి 6 : సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ‘ఆంధ్రజ్యోతి – ఏబీఎన్‌ నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగ ళూరు.. రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’ సారఽథ్యంలో అనురాధ కన్‌స్ట్రక్షన్‌ చైర్మన్‌ రెడ్డి అప్పలనాయుడు, చింతమనేని చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ చింతమనేని ప్రభాకర్‌ సౌజన్యంతో ఏలూరు అశోక్‌నగర్‌లోని కేపీడీటీ హైస్కూల్‌ గ్రౌండ్‌లో ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు పోటీలు జరుగుతాయి. న్యాయ నిర్ణేతలు విజేతలను ఎంపిక చేసి మొదటి బహుమతి రూ.6 వేలు, రెండో బహుమతి రూ.4 వేలు, మూడో బహుమతి రూ.3 వేలు చొప్పున నగదుతోపాటు కన్సొలేషన్‌ బహుమతులు అందజేస్తారు.

Updated Date - Jan 07 , 2024 | 01:13 AM