Share News

రండి.. చూడండి

ABN , Publish Date - Jun 12 , 2024 | 12:25 AM

సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో కూటమి ఘన విజయం. జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూటమి ఏకపక్షంగా గెలిచింది.

రండి.. చూడండి
ఏలూరు రామకోటిలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్‌

కూటమిలో ఉట్టి పడుతున్న ఉత్సాహం

భారీగా తరలివెళ్తున్న జనం

మంగళవారం రాత్రి నుంచే ఏర్పాట్లు

ఏలూరు సమీపాన దూరప్రాంతం నుంచి వచ్చేవారికి అల్పాహార ఏర్పాట్లు

ప్రతి నియోజకవర్గానికి నాలుగు బస్సులు

ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెంలో ఎల్‌ఈడీ స్ర్కీన్లు

సార్వత్రిక ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో కూటమి ఘన విజయం. జిల్లాలో ఏడు అసెంబ్లీ స్థానాలతో పాటు ఎంపీ స్థానాన్ని కూటమి ఏకపక్షంగా గెలిచింది. ప్రజా తీర్పు పెను సునామీలా వైసీపీని తుడిచి పారేసింది. ఈ నేపథ్యంలో కూటమి పక్షాన నేడు ముఖ్య మంత్రిగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు గన్నవరం దిశగా ప్రయాణం ఆరంభిం చారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న వేలాది మంది ప్రత్యేక వాహనాల్లో ఆర్టీసీ బస్సుల్లో తరలి రావడానికి సొంత ఏర్పాట్లు చేసుకున్నారు.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :

తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేడర్‌కు ఈ రోజు మహా పండుగ. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేడర్‌ కూటమి ప్రమాణ స్వీకారం కనులారా చూసేందుకు గడి చిన మూడురోజులుగా ఉత్సాహ పడుతున్నారు. ఏ పరి స్థితుల్లోనూ తాము ప్రమాణస్వీకార ప్రాంతానికి తరలి వెళ్ళాల్సిందేననే పట్టుదలతో మంగళవారం రాత్రి నుంచే దూరప్రాంతాలైన శ్రీకాకుళం, విశాఖపట్నం కొంతమంది యువకులు ఉత్సాహంగా బైక్‌లపై ప్రయాణం ఆరంభిం చారు. మరికొంతమంది తమ ప్రైవేట్‌ వాహనాల్లో తెల్ల వారుజాము నాటికి ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతానికి చేరుకుని ఆ తదుపరి గన్నవరం చేరేందుకు సన్నాహాల్లో ఉన్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్స వానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హాజరవుతుండటంతో ఆ మేరకు బీజేపీ కేడర్‌ హాజరయ్యేందుకు సొంత ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయా నియోజక వర్గాల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలంతా తమ వారందరికి దిశ నిర్దేశం చేశారు. కొందరి ముఖ్యనేతలు అందరికి ప్రభుత్వ పక్షాన పాస్‌లు అందేలా చూశారు. వాహనాలతో తరలివెళ్ళే నేతలు కొందరికి కారుపాస్‌లు సమకూర్చారు. ఏలూరు, దెందు లూరు, ఉంగుటూరు, చింతలపూడి, కైకలూరు, నూజి వీడు నియోజక వర్గాల నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నేతలు కూటమి పక్షాన హాజరు కాబోతున్నారు. సీనియర్‌ నేతలు అందరికి వి.వి.ఐ.పి పాస్‌లను అంద జేశారు. దీనికి తోడు శ్రీకాకుళం నుంచి గన్నవరం వరకు మార్గాన పెద్దఎత్తున ట్రాఫిక్‌ జామయ్యే అవకాశాలు ఉండడంతో సాధ్యమైనంత మేర ముందుగానే సభా ప్రాంగణానికి హాజరు కావాల్సిందిగా పోలీస్‌ వర్గాలు ఇప్పటికే సూచనలు చేశాయి. సభకు హాజరయ్యే మహిళా నేతలు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు.

నియోజకవర్గానికి నాలుగు బస్సులు

నియోజక వర్గానికి నాలుగు ఆర్టీసీ బస్సులను ఏర్పా టు చేశారు. ఆయా నియోజక వర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కేడర్‌ యావత్తు ఈ బస్సుల్లోనే సర్దుకో వాలి. ముఖ్యనేతలు, పార్టీ బాధ్యులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు వీలుగానే ఈ ఏర్పాటు చేశారు. ఇంకోవైపు నియోజక వర్గాల వారీగా మరికొంత మంది సొంత వాహనాలను సిద్ధం చేసుకున్నారు. ఎమ్మె ల్యేలు, ఎంపీలు, పొలిట్‌ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్సీలు, వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయడంతో పాటు పాస్‌లను సమకూర్చారు. ఎవ్వరికి ఏ లోటు రాకుండా అన్ని ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి చూసుకుంటున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ పట్నం ప్రాంతాల నుంచి తరలివచ్చే వారికోసం ఉద యాన్నే కొంచెం సేదతీరేందుకు ఉపాహారం అందించేం దుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఏలూరు సమీ పంలోని రామచంద్రా ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ప్రాంగణంలో, సమీపాన ఉన్న సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ఆవరణలో, ఓల్డ్‌ నోవా ఇంజినీరింగ్‌ కాలేజ్‌ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీన్ని మంగళవారం సంబం ధిత అధికారులు పరిశీలించారు. దూరప్రాంతాల నుంచి వస్తున్నందున వారి బాగోగులను ఉదయాన్నే చూడాల్సిం దిగా కొంతమందికి బాధ్యతలు అప్పగించారు.

విద్యుత్‌ వెలుగుల్లో కలెక్టరేట్‌

ఏలూరు సిటీ : రాష్ట్రంలో బుధవారం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు దీరబోతోంది. దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ముస్తాబవుతున్నాయి. ఇందులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ను, ఆర్‌ఆర్‌పేటలోని విద్యుత్‌ భవన్‌ను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. విద్యుత్‌ కాంతులతో కలెక్టరేట్‌ భవనం విరాజిల్లుతోంది. ఆర్‌ఆర్‌పేటలోని విద్యుత్‌ సర్కిల్‌ కార్యాలయం( విద్యుత్‌భనవ్‌)ను విద్యుత్‌ కాంతులతో తీర్చిదిద్దారు.

వాహనాల దారి మళ్ళింపు

ఏలూరు క్రైం : చంద్రబాబు బుధవారం ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దృష్ట్యా వాహనాల దారి మళ్ళింపునకు జిల్లా పోలీస్‌ యంత్రాం గం చర్యలు చేపట్టింది. రాజమండ్రి వైపు నుంచి వచ్చే వాహ నాలను భీమడోలు నుంచి ద్వారకా తిరుమల, కామవరపుకోట, చింతలపూడి మీదుగా హైదరాబాద్‌ వైపు లేదా విజయవాడకు వెళ్ళడానికి అనుమతి ఇస్తు న్నారు. గుండుగొలను సెంటర్‌ నుంచి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు. ఒక వేళ ఏలూరు వద్దకు వాహ నాలు వస్తే జంగారెడ్డిగూడెం రోడ్డులో నుంచి, మరి కొన్నింటిని చింతలపూడి రోడ్డుకు పంపిస్తున్నారు. కల పర్రు టోల్‌గేటు వరకూ వాహనాలు వెళ్ళితే వాటిని తిరిగి వెనుకకు పంపించి ఏలూరు దుగ్గి రాల బైపాస్‌ వద్ద నుంచి కలపర్రు మీదుగా నూజివీడుకు పంపిస్తు న్నారు. మరికొన్ని వాహనాలను సోమవర ప్పాడు బ్రిడ్జి వద్ద నుంచి జంగారెడ్డిగూడెం వైపునకు, మరికొన్ని వంగూరు బ్రిడ్జి నుంచి చింతలపూడి రోడ్డు నకు పంపి స్తున్నారు. బుధవారం ఉదయం ఏలూరు మీదుగా వెళ్ళే వాహనాలను పోలీసులు తనిఖీలు చేసి పాస్‌ ఉంటేనే విజయవాడ వైపు పంపిస్తారు. విజయ వాడ వెళ్ళే బస్సులను నూజివీడు మీదుగా నడపడానికి చర్యలు చేపట్టారు. మరికొన్ని బస్సులు హనుమాన్‌జంక్షన్‌ నుంచి దారి మళ్ళించడానికి చర్యలు తీసుకున్నారు.

Updated Date - Jun 12 , 2024 | 12:25 AM