Share News

ఐదేళ్లలో పైపులు తొలగిస్తాం

ABN , Publish Date - May 25 , 2024 | 12:04 AM

మండలంలోని వైఎస్‌ పాలెం, రుస్తుంబాద, సీతారాంపురం గ్రామాలకు చెందిన రైతులు ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ ఏర్పాట్లపై చేస్తున్న ఆందోళనకు శుక్రవారం రాజీ కుదిరింది.

ఐదేళ్లలో పైపులు తొలగిస్తాం
కలెక్టర్‌తో చర్చిస్తున్న రైతులు

75 మంది రైతులకు రూ.35 లక్షల పరిహారం

కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో చర్చలు సఫలం

ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ పనులకు గ్రీన్‌ సిగ్నల్‌

నరసాపురం రూరల్‌, మే 24: మండలంలోని వైఎస్‌ పాలెం, రుస్తుంబాద, సీతారాంపురం గ్రామాలకు చెందిన రైతులు ఓఎన్‌జీసీ పైప్‌లైన్‌ ఏర్పాట్లపై చేస్తున్న ఆందోళనకు శుక్రవారం రాజీ కుదిరింది. భీమవరంలో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీతో మూడు గ్రామాల రైతుల ప్రతినిధులు చర్చలు జరిపారు. దీనిలో ఓఎన్‌జీసీ అధికారులు పాల్గొన్నారు. ముందుగా రైతులు పైప్‌లైన్‌ ఏర్పా ట్ల వల్ల తమకు కలిగే ఇబ్బందుల్ని వివరించారు. దీనికి కలెక్టర్‌ ఐదేళ్లలో వేసిన పైప్‌లైన్లు తీసివేస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటు ఆ భూములను రెడ్‌జోన్‌గా పెట్టబోమని స్పష్టం చేశారు. నష్టపోతున్న 75 మంది రైతులకు రూ. 35లక్షలు పరిహారం ఇస్తామన్నారు. రైతులు ఆమ్ముకునేందుకు ఎటువంటి ఇబ్బం దులు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు. దీంతో ఆందోళనను విరమించి పైప్‌లైన్‌ పనులకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. మూడు గ్రామాల అభివృ ద్ధికి తనవంతు కృషి చేస్తామన్నారు. ఓఎన్‌జీసీ కూడా సామాజిక సేవా కార్యక్ర మాల్లో ఈ గ్రామాలకు నిధులు కేటాయిస్తుందని హామీ ఇచ్చారు. ఈ చర్చలో వైఎస్‌ బాబులు, వైఎస్‌ హరి, ఆకన చంద్రశేఖర్‌, వాసు, బందెల రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:04 AM