మావుళ్లమ్మకు కలెక్టర్ నాగరాణి పూజలు
ABN , Publish Date - Aug 21 , 2024 | 12:18 AM
మావుళ్ళమ్మ అమ్మవారిని కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం దర్శించుకుని పూజలు చేశారు. ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు
భీమవరంటౌన్, ఆగస్టు 20 : మావుళ్ళమ్మ అమ్మవారిని కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం దర్శించుకుని పూజలు చేశారు. ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం తరపున ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మినగేష్ శేషవస్త్రం, అమ్మవారి ఫొటో అందించారు. భీమవరం డివిజన్ ఎండోమెంట్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వరరావు ఉన్నారు.
సోలార్ రూప్ టాప్ పథకాన్ని సద్వినియోగించాలి
విద్యుత్ ఆదాకు సోలార్ రూప్ టాప్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ నాగరాణి కోరారు. మంగళవారం స్థానిక కలెక్టర్ చాంబ ర్‌లో విద్యుత్ ఆదాకు సోలార్ రూప్ టాప్ ఏర్పాటు, వినియోగదారుల బిల్లు లు చెల్లింపునకు ఏర్పాటు చేసిన ప్రచార సాధనాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. విద్యుత్ పొదుపునకు సరైన మార్గం సోలార్ విద్యుత్ ఏర్పాటు చేసుకోవడమేనన్నారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం కింద సోలార్ రూప్ టాప్ నిర్మించుకోవడానికి పెద్ద మొత్తంలో సబ్సిడీ అందుతుందన్నారు. ఈమేరకు వెబ్‌సైట్‌లోకాని, పోర్టర్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ పీర్ అహ్మద్ ఖాన్, డీఈఈ రాజగోపాల్ చౌదరి తదితరులు ఉన్నారు.