Share News

బాధ్యతాయుతంగా పనిచేయండి

ABN , Publish Date - Jun 27 , 2024 | 12:02 AM

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టరేట్‌లోని సూపరింటెండెంట్‌లు, అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి ఆదేశించారు.

బాధ్యతాయుతంగా పనిచేయండి
కలెక్టర్‌ వెట్రిసెల్వికి మొక్క అందిస్తున్న ఏపీ ఎన్జీవో సంఘ నేతలు

అధికారులకు కలెక్టర్‌ వెట్రిసెల్వి దిశానిర్దేశం

ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 26: ప్రభుత్వ ప్రాధాన్యత అంశాల అమలులో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టరేట్‌లోని సూపరింటెండెంట్‌లు, అధికారులు, సిబ్బందిని కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి ఆదేశించారు. జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక ్టరేట్‌లో బుధవారం పలు విభాగాల సెక్షన్ల అధికారులు సిబ్బందితో సమావే శం నిర్వహించారు. మెరుగైన పనితీరుతో అప్పగించిన పనులను సమర్ధవం తంగా పూర్తి చేయాలన్నారు. కలెక్టరేట్‌లోని ఎస్టాబ్లిస్‌మెంట్‌, కోఆర్డినేషన్‌, మినిస్ర్టీరియల్‌ సెక్షన్‌, భూసేకరణ, తదితర విభాగాల అధికారులు, సిబ్బంది ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రాధాన్యత అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని ఏ రోజుకారోజు నివేదికలు తయారుచేసి సమర్పించాలన్నారు. సమావేశంలో డీఆర్వో డి.పుష్పమణి, ఏవో కె.కాశీవిశ్వేశ్వరరావు, సెక్షన్‌ సూపరింటెండెంట్‌లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణ అనంతరం కలెక్టర్‌ వెట్రిసెల్విని జాయింట్‌ కలెక్టర్‌ బి.లావణ్యవేణి మర్యాదపూర్వకంగా కలసి పూలమొక్కను అందజేశారు. ఎస్పీ డి.మేరిప్రశాంతి, ఎన్జీవో నాయకులు, ఆర్డీవో ఖాజావలీ, పలువురు ఉన్నతాధికారులు, వివిధ సంఘాల నాయకు లు కలెక్టర్‌ను కలసి పుష్ఫగుచ్చం అందజేశారు.

ఏలూరు క్రైం: బాధిత మహిళల సహాయం కోసం ఏర్పాటు చేసిన వన్‌స్టాప్‌ సఖి సెంటర్‌లో మెరుగైన సేవలందించాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో దిశ వన్‌ స్టాప్‌ సెంటర్‌ను కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. బాధిత మహిళలు, పిల్లల కు అందుతున్న సేవలను పరిశీలించారు. ఐసీడీఎస్‌ పీడీ పద్మావతి, వన్‌ స్టాప్‌ సెంటర్‌ అడ్మిన్‌ సీహెచ్‌ నిర్మల, తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్జేవి యర్‌ నగర్‌లోని ఉద్యోగినుల వసతి గృహాన్ని సందర్శించి అక్కడ మహిళలకు అందుతున్న సేవలను పరిశీలించారు.

బుట్టాయగూడెం: కలెక్టర్‌ కె.వెట్రిసెల్విని కేఆర్‌.పురం ఐటీడీఏ పీవో ఎం.సూర్యతేజ మర్వాదపూర్వకంగా కలుసుకుని పచ్చని మొక్కను అందజేసి అభినందనలు తెలియజేశారు.

ఏలూరు ఎడ్యుకేషన్‌: బాధ్యతలు చేపట్టిన కలెక్టర్‌ కె.వెట్రిసెల్విని పలు ఉద్యోగ సంఘాల జిల్లానాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధిలో ఉద్యోగులు తనకు సహకరించాలని, సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కలెక్టర్‌ను కలసిన వారిలో ఏపీ ఎన్జీవోల సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరిజిల్లా చైర్మన్‌ సీహెచ్‌.శ్రీనివాస్‌, కార్యదర్శి ఎన్‌.రామారావు, నాయకులు శ్రీధర్‌రాజు, సత్యనారాయణ, నరేంద్ర, గంగాధర్‌, నారాయణ, రమేష్‌, లక్షణ్‌కుమార్‌, మహిళా విభాగం ప్రతినిధులు మల్లిక, సత్యభారతి, ఝాన్సీ తదితరులున్నారు. కలెక్టర్‌కు శుభాకాంక్షలు తెలిపినవారిలో ఏపీ రెవెన్యూ ఎంప్లాయీస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.విద్యాసాగర్‌, ఏపీజేఏసీ–అమరావతి జిల్లా చైర్మన్‌, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రమేష్‌కుమార్‌, జిల్లా కార్యదర్శి ఎ.ప్రమోద్‌కుమార్‌, మహిళా విభాగం చైర్‌పర్సన్‌ సుందరి, జిల్లా నాయకులు మాధవి, వెంకటేశ్వరరావు, స్వామి, రాజరత్నకుమార్‌, రాంబాబు, వీరబాబు, రాఘవులు, శాంతకుమారి, గౌరీదేవి, ఝాన్సీలక్ష్మీబాయి, దివ్య, యామిని, తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 27 , 2024 | 12:02 AM