Share News

టిడ్కో ఇళ్లు పూర్తి చేయండి

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:42 PM

పీఎంఎవై, టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నాగ రాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణం, టిడ్కో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు.

టిడ్కో ఇళ్లు పూర్తి చేయండి
హౌసింగ్‌ అధికారులతో చర్చిస్తున్న కలెక్టర్‌ నాగరాణి

భీమవరం టౌన్‌, జూలై 5 : పీఎంఎవై, టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నాగ రాణి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గృహ నిర్మాణం, టిడ్కో ఇంజనీరింగ్‌ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పీఎంఏవై అర్బన్‌ కింద 70,119 గృహాలు మంజూరవగా 45,843 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని ఇప్పటివరకు 29,256 గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిం చామన్నారు. రాష్ట్రంలో జిల్లా 65 శాతం ప్రగతితో మూడో స్థానంలో నిలిచిందన్నారు. పీఎంఏవై గ్రామీణ్‌ కింద 3,673 ఇళ్లు మంజూరవగా 3,290 నిర్మాణంలో ఉండగా 1,803 ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేశామన్నారు. రాష్ట్రంలో జిల్లా 55 శాతం ప్రగతిలో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. టిడ్కో ఇళ్లపై అధికారులను ప్రశ్నించగా రెండు దశల్లో జిల్లాకు మొత్తం 21,424 ఇళ్లు మంజూ రయ్యాయని అధికారులు తెలిపారు. మొదటి విడతలో భీమవరంలో 8,352 తాడేపల్లిగూడెంలో 3,232, పాలకొల్లు 2,560 మొత్తం 11,136 ఇళ్లు మంజూరవగా ఇప్పటివరకు భీమవరంలో 5,408 తాడేపల్లిగూడెంలో 3.232., పాల కొల్లులో 2,560 ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్టు తెలిపారు. భీమవరంలో 5,408 తాడేపల్లిగూడెంలో 2,144, పాల కొల్లులో 3.584 మొత్తం 11.136 ఇళ్లకు 90 శాతం పైగా పూర్తయినట్లు తెలిపారు. రెండవ విడతలో తణుకు పట్ట ణంలో 912 ఇళ్లు మంజూరు కాగా నిర్మాణాలు జరుగు తున్నాయన్నారు. గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు సాధ్యమైనంత త్వరగా అందజేయా లని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో ఇన్‌చార్జి జిల్లా గృహ నిర్మాణశాఖ అధికారి జి.పిచ్చయ్య, ఈఈ బి.వెంకట రమణ, టిడ్కో ఈ.ఈ ఎం.ఎస్‌ స్వామినాయుడు, డీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 11:42 PM