Share News

సీఎం బస్సు యాత్రతో జనం పాట్లు

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:47 AM

సీఎం జగన్‌ మూడు రోజుల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన గురువారం ముగిసింది.

సీఎం బస్సు యాత్రతో జనం పాట్లు
తణుకు వై జంక్షన్‌ వద్ద..

ఇరగవరం/పెనుగొండ, ఏప్రిల్‌ 18 : సీఎం జగన్‌ మూడు రోజుల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన గురువారం ముగిసింది. ‘మేమంతా సిద్ధం’ పేరిట ఆయన మంగళవారం భీమవరంలో బహి రంగ సభ నిర్వహించి రాత్రికి తణుకు మండలం తేతలిలో బస చేశా రు. బుధవారం యాత్రకు విరామం ప్రకటించి గురువారం ఉదయం 11 గంటలకు తిరిగి తూర్పు గోదావరి వైపు యాత్రను కొనసాగించారు. అయితే ఉదయం సీఎంను కలిసేందుకు పెద్దఎత్తున నాయకులు, కార్య కర్తలు తరలివచ్చారు. పోలీసులు వారిని ఆయన వద్దకు వెళ్లనివ్వలే దు. ఓ మహిళను అయితే బయటకు నెట్టేశారు. జాతీయ రహదారి వెంబడి వున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు జగన్‌ బస్సులో నుంచే అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. తేతలి, తణుకు వై.జం క్షన్‌, ఉండ్రాజవరం జంక్షన్‌, పెరవలి, సిద్ధాంతం మీదుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. షరిష్ట కూడలి వద్ద జగన్‌ కిందికి దిగి పలువురి నుంచి వినతులు స్వీకరించారు. పెరవలిలో జన మూహం తక్కువగా ఉండడంతో బస్సు నుంచే అభివాదం చేశారు. ఈ బస్సుయాత్ర జాతీయ రహదారి మీదుగా కావడంతో దూర ప్రయాణం చేసేవారు ప్రతి కూడలిలో చాలా సేపు ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో వాహనదారులు హారన్‌ మోగిస్తూ అసహనం వ్యక్తం చేశారు. సిద్దాంతం కూడలి వద్ద పోలీసులు ట్రాఫిక్‌ ను నిలిపివేయడంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాఫిక్‌లో 108 అంబులెన్స్‌ చిక్కుకుపోయిది. పోలీసులు, యువకులు వాహనాలను తప్పిస్తూ అంబులెన్సును ముందుకు పంపించారు.

Updated Date - Apr 19 , 2024 | 12:48 AM