Share News

తేతలిలోనే సీఎం బస

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:48 AM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి తణుకు మండలం తేతలిలో బస చేశారు. సాయంత్రం భీమవరంలో మేము సిద్ధం బహిరంగ సభ ముగించుకుని ఇక్కడకు వచ్చారు.

తేతలిలోనే సీఎం బస

నేడు తణుకు, సిద్ధాంతం మీదుగా

ఉమ్మడి తూర్పు గోదావరిలోకి పయనం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బస్సు యాత్రలో భాగంగా మంగళవారం రాత్రి తణుకు మండలం తేతలిలో బస చేశారు. సాయంత్రం భీమవరంలో మేము సిద్ధం బహిరంగ సభ ముగించుకుని ఇక్కడకు వచ్చారు. వాస్తవానికి ఆయన రాత్రి బస ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రావులపాలెం మండలం ఈతకోటలో బస చేయాల్సి వుంది. అయితే పలు కారణాల రీత్యా తేతలిలోనే రాత్రి బస చేశారు. బుధవారం శ్రీరామ నవమి కావడంతో విరామం ప్రకటించి రోజు మొత్తం ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారు. బస్సులోనే ఉన్నారు. నాయకులు ఎవరినీ అనుమతించలేదు. ముఖ్యమంత్రి బస ప్రాంతంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం తిరిగి బస్సుయాత్ర ప్రారంభం కానుంది. ఆ మేరకు షెడ్యూల్‌ ఖరారుచేశారు. జిల్లా నుంచి గురువా రం ఉదయం తొమ్మిది గంటలకు బస్సుయాత్ర మొదలవు తుంది. తణుకు బైపాస్‌, పెరవలి, సిద్ధాంతం, రావులపాలెం, జొన్నాడ మీదుగా యాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్నం కడియపులంకలో విశ్రాంతి తీసుకుంటారు. తర్వాత బొమ్మూ రు, రాజమండ్రి నగరంలో రోడ్‌ షో నిర్వహిస్తారు. రాత్రికి ఎస్‌టి రాజాపురం సమీపంలో బస చేస్తారు. ఆ దిశగా పార్టీ నేతలు ప్రణాళిక రూపొందించారు. తేతలిలో బుధవారం ముఖ్యమంత్రి బస చేసిన ప్రాంతానికి అనేక మంది నేతలు, ప్రజలు వచ్చినప్పటికి ఎవరినీ అనుమతించలేదు.

Updated Date - Apr 18 , 2024 | 12:48 AM