Share News

ఆచంట నుంచే ఎన్నికల శంఖారావం

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:07 AM

ఆచంటలో ఈనెల 7న జరిగే భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారని ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. మంగళవారం కమ్మ సంఘం భవనంలో టీడీపీ సమన్యయ కమిటీ సమావేశం జరిగింది.

ఆచంట నుంచే ఎన్నికల శంఖారావం
సభా స్థలం పరిశీలిస్తున్న టీడీపీ నాయకులు

ఆచంటలో భారీ బహిరంగ సభ

7న చంద్రబాబు రాక

ఆచంట, జనవరి 2: ఆచంటలో ఈనెల 7న జరిగే భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారని ఇక్కడి నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి అన్నారు. మంగళవారం కమ్మ సంఘం భవనంలో టీడీపీ సమన్యయ కమిటీ సమావేశం జరిగింది. మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఆచంటలో జరిగే సభకు ఏడు నియోజకవర్గాల నుంచి సుమారు లక్ష మంది పైగానే జనం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సభకు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రానప్పటికి టీడీపీ, జనసేన సమన్వయంతోనే ఈ సభను విజయవంతం చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. రాజమండ్రి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి మాట్లాడుతూ ఈ బహిరంగ సభకు చలో ఆచంటగా నామకరణం చేశామన్నారు.ఈ సభతో ఎన్నికల కురుక్షేత్రానికి వెళుతున్నట్లు తెలిపారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు మాట్లాడుతూ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేసి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మంత్రులు జవహర్‌, పీతల సుజాత, మాజీ ఎమ్మెల్యేలు గన్ని వీరాంజనేయులు, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కలవపూడి శివ, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు,నరసాపురం ఇన్‌చార్జి పొత్తూరి రామరాజు, తాడేపల్లిగూడెం ఇన్‌చార్జి వలవల బాబ్జి, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. బహిరంగ సభకు అనుకూలంగా ఉన్న స్థలాన్ని టీడీపీ ముఖ్యనేతలు పరిశీలించారు. సుుమారు లక్ష మంది జనం వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో సభా స్థలం, వాహనాల పార్కింగ్‌ స్థలాన్ని కూడా పరిశీలించి నిర్ణయం తీసుకున్నారు. ఆచంట నుంచి మార్టేరు వెళ్లే రోడ్డులో ఒక లేఅవుట్‌ స్థలం సభకు అనుకూలంగా ఉంటుందని గుర్తించారు. వచ్చే జనం ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.

Updated Date - Jan 03 , 2024 | 12:07 AM