Share News

చికెన్‌..పరుగు!

ABN , Publish Date - Feb 29 , 2024 | 11:52 PM

మార్కెట్‌లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి కోళ్ల దిగుమతులు తగ్గిపోవడంతో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. ముది నేపల్లి ప్రాంతంలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ కేజీ రూ.260 నుంచి ఒకేసారి అమాం తంగా రూ.320కి చేరింది.

చికెన్‌..పరుగు!

తగ్గిన కోళ్ల సరఫరాతో ధరలకు రెక్కలు

ముదినేపల్లి, ఫిబ్రవరి 29: మార్కెట్‌లో చికెన్‌ ధరలు భారీగా పెరిగాయి. ఇతర ప్రాంతాల నుంచి కోళ్ల దిగుమతులు తగ్గిపోవడంతో చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. ముది నేపల్లి ప్రాంతంలో స్కిన్‌ లెస్‌ చికెన్‌ కేజీ రూ.260 నుంచి ఒకేసారి అమాం తంగా రూ.320కి చేరింది. స్కిన్‌తో కూడిన చికెన్‌ కేజీ రూ.220 నుంచి రూ.280కి పెరిగింది. బోన్‌లెస్‌ చికెన్‌ కేజీ రూ.380 నుంచి రూ.400 వరకు ధర పలుకుతోంది. ఫారం కోడి ధర కేజీ రూ.170 నుంచి రూ.200కి పెరిగింది. చికెన్‌ను ఎక్కువగా వినియోగించే మధ్య తరగతి, సామాన్య ప్రజలకు ఈ ధరలు భరించలేనివిగా ఉన్నాయి. కోళ్ల ఫారంల వద్ద కోళ్ల ధరలు పెరగడం, జంగారెడ్డిగూడెం తదితర ప్రాంతాల నుంచి కోళ్ల సరఫరా తగ్గడంతో మార్కెట్‌లో కొరత ఏర్పడి ధరలు పెరిగాయి. బర్డ్‌ ప్లూ వ్యాధి కారణంగా నెల్లూరు జిల్లా నుంచి ముదినేపల్లి ప్రాంతానికి కోళ్ల దిగుమతి దాదాపు స్తంభించింది. ఈ నేపథ్యంలో ధరలు మండిపోతున్నాయి. సామాన్యులు చికెన్‌ను కొనే స్థితిలో లేరు.

Updated Date - Feb 29 , 2024 | 11:52 PM