ఎమ్మెల్యే లేకుండానే..
ABN , Publish Date - Feb 15 , 2024 | 11:17 PM
మండలం లోని పలు గ్రామాల్లో సచివాలయాలు ప్రారం భోత్సవాలు, రోడ్ల నిర్మాణాలకు శంకు స్థాపన లు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సభలు నిర్వహించినా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా లేకుండానే జరపడం విశేషం.
చింతలపూడి నియోజకవర్గంలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..
కామవరపుకోట, ఫిబ్రవరి 15 : మండలం లోని పలు గ్రామాల్లో సచివాలయాలు ప్రారం భోత్సవాలు, రోడ్ల నిర్మాణాలకు శంకు స్థాపన లు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల సభలు నిర్వహించినా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా లేకుండానే జరపడం విశేషం. కామ వరపు కోట నుంచి రామన్నపాలెం మీదుగా తూర్పు యడవల్లి వెళ్లేందుకు నాలుగు కోట్ల రూపాయల అంచనాతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులను గురువారం ఎంపీ కోటగిరి శ్రీధర్, వైసీపీ ఏలూరు పార్లమెంటు ఇన్‌చార్జి కారు మూరి సునీల్‌కుమార్, వైసీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు స్థానిక నాయకులతో పాటు శంకుస్థాపన చేశారు. వీరిశెట్టిగూడెం, తడికలపూడి, రావికంపాడు, అంకాలంపాడు గ్రామాల్లో పలు ప్రభుత్వ భవనాలకు ప్రారంభోత్స వాలు చేశారు. శిలాఫలకాలపై ఎమ్మెల్యే ఎలీజా పేరు ఉన్నప్పటికీ ఆయన ఏ కార్య క్రమానికి హాజరు కాలేదు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఎలీజాను వివరణ కోరగా అధికారులు, ఉద్యోగులు, జిల్లా యంత్రాంగం తనను ఆహ్వానించలేదని తెలిపారు. ఎమ్మెల్యే లేకుండానే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పలువురు ప్రజాస్వామ్య వాదులు పేర్కొంటున్నారు.