Share News

చింతలపూడి సమస్యలతో సతమతం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:49 AM

చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో అన్నీ చింతలే.. తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, మురుగుతో పట్టణ ప్రజలు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు.

చింతలపూడి సమస్యలతో సతమతం
నిలిచిపోయిన చింతలపూడి ఎత్తిపోతల కాల్వ పనులు

టిడ్కో ఇళ్లు ఇవ్వలేదు

ఎత్తిపోతల పథకం ముందుకు సాగలేదు

ఎర్ర కాలువ కష్టాలు

అసంపూర్తిగా పట్టెన్నపాలెం బ్రిడ్జి

చింతలపూడి నియోజకవర్గ కేంద్రంలో అన్నీ చింతలే.. తాగునీరు, విద్యుత్‌, పారిశుధ్యం, మురుగుతో పట్టణ ప్రజలు ఏళ్ల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గంలో మరో పట్టణం జంగారెడ్డిగూడెంలో ఏళ్ల తరబడి సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి, వైసీపీ నేతలు 2019 ఎన్నికల ముందు ఇచ్చిన హమీలను అమలు చేయలేదు. ప్రస్తుతం అవే హమీలతో ప్రచారానికి దిగడం విడ్డూరం. జంగారెడ్డిగూడెం పట్టణంలో తాగునీరు, అంతర్గత రహదారులు, డ్రెయినేజీ రోడ్ల సమస్యలు అసంపూర్తిగా ఉన్నాయి. కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో సైతం హామీలు అమలు కాలేదు.. సమస్యలు పరిష్కారం కాలేదు.

– చింతలపూడి, జంగారెడ్డిగూడెం, లింగపాలెం

చింతలపూడి ఉత్తిపోతలు..!

గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా మళ్లించి సాగు, తాగునీరు ఇవ్వాలని 2006లో ఈ పథకానికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టి 1701 కోట్లు కేటాయించారు. 2014లో ఈ పథకాన్ని టీడీపీ ప్రభుత్వం విస్తరించి కృష్ణా జిల్లా మెట్ట ప్రాంతాలకు మళ్లించాలని 3వేల కోట్లతో పను లు చేపట్టారు. వైసీపీ ప్రభుత్వంలో నాబార్డు నుంచి రూ.1950 కోట్లు రుణం పొందినా ఈ పథకాన్ని పూర్తి చేయలేదు. పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీ నిల బెట్టుకోలేదు. పరిహారం పెంచి ఇవ్వాలన్న రైతుల డిమాండ్‌ నెరవేరక ఇప్పటికీ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల నిర్మాణం నిలిచిపోయిన కాలువ మట్టిని కూడా ప్రభుత్వం అమ్ముకుంటోంది.

ఎక్కడి టిడ్కో అక్కడే..

పేదల ఇంటి కల నిజం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. జంగారెడ్డిగూడెంలో 2016లో 864 టిడ్కో గృహ సముదాయాల నిర్మాణం చేపట్టారు. 2019 ఎన్నికల సమయానికి నిర్మాణం చివరి దశకు వచ్చింది. నాటి నుంచి పనులు అడుగు కూడా ముందుకు కదల్లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తేదీలు మార్చుతూ ప్రజలను మభ్య పెట్టింది. రంగులు మార్చి రిజిష్ట్రేషన్‌ పేరుతో పేదలను మోసం చేశారు.

బైనేరు వంతెన కూలి ఆరేళ్లు..

2018 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు బైనేరు వంతెన కుప్పకూలింది. బ్రిటీష్‌ కాలంలో నిర్మించిన 125 ఏళ్ల వంతెన తెగిపోవడంతో వాహనదారుల ఇ బ్బందులు అన్నీ ఇన్ని కాదు. నూతన బ్రిడ్జి నిర్మాణం సంగతి పక్కనపెడితే, స్థానిక ప్రజాప్రతినిధులు పడిపోయిన బ్రిడ్జి మరమ్మతు చేయిస్తామంటూ ప్రక టనలు చేశారు. ఇప్పటికి కూలిన బ్రిడ్జి శిథిలాలు మాత్రమే తొలగించారు.

స్వచ్ఛ లక్కవరం జాడ లేదు

జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రా మానికి ప్రత్యేకత ఉంది. 18వేల మంది జనా భా, 8వేల పైచిలుకు ఓట్లు ఒక్క లక్కవరం లో ఉన్నాయి. నాయకులు ఓట్ల కోసం లక్కవరం గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా చేసి చూపిస్తామంటూ హమీలు గుప్పిం చారు. తీరా చెత్త సేకరణ వాహనాలు లేక చెత్త లక్కవరంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. పాత డంపింగ్‌ యార్డు ఉన్న ప్పటికి కొత్త డంపింగ్‌ యార్డు నిర్మాణం చేపట్టారు. రెండు డం పింగ్‌ యార్డులను వినియోగిం చకపోగా రోడ్డుపైనే చెత్తను కుప్పలుగా పేర్చి తగలబెడుతున్నారు.

ఎర్రకాలువ ఆధునీకరణ లేదు

ఎర్రకాలువ జలాశయం ఆధునీకరణ చేస్తా మని సీఎం హామీ ఇచ్చారు. కనీస మరమ్మ తులు కూడా చేయించ లేదు. ప్రాజెక్టు కనీస నిర్వహణ లేదు. ఎర్రకాలువ సాగు పరిధి పెంచాల్సిన అవసరం ఉం దని తెలిసినా పట్టించుకోవడం లేదు. వైసీపీ ప్రభు త్వం తాగునీరు, సాగునీరు ప్రాజెక్టులను పట్టించు కోదని రైతులు వాపోతున్నారు.

8 ఏళ్లుగా నిర్మాణం..

2016లో ప్రారంబించిన పట్టెనపాలెం బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాలేదు. జల్లేరువాగుపై పట్టెన్నపా లెం బ్రిడ్జి గుండా గుబ్బల మంగ మ్మ ఆలయానికి నిత్యం భక్తులు వెళ్తుంటారు. బ్రిడ్జి నిర్మాణం జరగక వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

సమస్యల స్థాయి పెంపు..

పంచాయతీ నుంచి నగర పంచాయతీ స్థాయికి పెరిగిన చింతలపూడికి పేరుకే పట్టణ హోదా. సౌకర్యాల కల్పనలో మారుమూల గ్రామకంటే అధ్వా నం. మౌలిక సదుపాయాలు లేవు.. అడుగుదామంటే పాలకవర్గ ఎన్నికలే లేవు. ఇళ్ల పన్ను, చెత్త పన్ను బాదేస్తున్నారు. తాగు నీరు లేదు, డ్రైయినేజీ సౌకర్యం లేదు. పట్టణంలో వీధి దీపాలు కూడా వెలగవు. ఎటు చూసినా ఆరు కిలోమీటర్ల పరిధిలోని పట్టణంలో సరైన రోడ్డు లేదు. పట్టణంలో 20 వార్డులు, 35 వేలకు పైగా జనాభా ఉన్నారు. అధిక శాతం దళితవాడలు ఉన్నా నిధుల శాపమో.. నాయకుల నిర్లక్ష్యమో అభివృద్ధి మాత్రం శూన్యం.

బస్సు డిపో ఏర్పాటు కల..

జిల్లాలోనే పెద్ద నియోజకవర్గమైన చింతలపూడి తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ఉంది. నియోజకవర్గ కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు 1975 నుంచి డిమాండ్‌ చేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కలగానే మిగిలింది. 1990లో వామపక్ష పార్టీలు డిపో ఏర్పాటు చేయాలని 40 రోజులపాటు రిలే దీక్షలు నిర్వహించారు. గతంలో ఉన్న బస్సు సర్వీసులను రద్దు చేశారు. ఎమ్మెల్యే ఎలీజా రవాణా మంత్రి దృష్టికి రాజధాని విజయవా డకు ఒక్క బస్సు అయినా ఏర్పాటు చేయండని చెప్పినా ఉపయోగం కలుగలేదు. ఈ సమస్య ఈ ప్రాంత ప్రజలకు కలగానే మిగిలింది.

వెలగని వీధి దీపాలు

2005లో చింతలపూడి మెయిన్‌ రోడ్డు విస్తరించి నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేశారు. 2008లో రూ. కోటితో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేశారు. ఇవి ప్రారంభించిన రోజు మాత్రమే వెలిగాయి. తరువాత మరమ్మతుల పేరిట నిధులు వెచ్చించారు తప్ప ఏ రోజునా వీధి దీపం వెలిగితే ఒట్టు. ఐదేళ్లలో విద్యుత్‌ వెలుగుల ఊసే లేదు. రాత్రివేళ పట్టణ ప్రజలు బస్సు దిగి చీకటిలో ఇంటికి వెళ్లాల్సిందే. నగర పంచాయతీ అయినా కనీసం వీధి దీపానికి కూడా నోచుకోలేదని పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది.

రోడ్డు.. శిలాఫలకంతో సరి..

బోయగూడెం–సీతానగరం రోడ్డు నిర్మాణం 20 ఏళ్లుగా శిలాఫలకాలకే పరిమితమైంది. ఈ మార్గంలో మూడు పంచాయతీలు, 11 శివారు గ్రామాలు, 17 కిలోమీటర్ల రోడ్డు అధ్వానంగా ఉంది. 20 ఏళ్లల్లో నలుగురు ఎమ్మెల్యేలు రోడ్డు వేయలేకపోయారు. 2018లో అప్పటి సీఎం చంద్రబాబు రూ.8 కోట్లు మంజూరు చేస్తూ శిలాఫలకం వేస్తే వైసీపీ ప్రభు త్వంలో దానిని పడగొట్టి ఆనవాలు లేకుండా చేశారు.

లింగపాలెం మండలంలో ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేయిస్తానని, డ్రెయినేజీలు కట్టిస్తానని వైసీపీ ఎమ్మెల్యే హామీలు ఇచ్చారు. ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. గ్రామాల్లో కొత్తబోర్లు వేయించి తాగునీరు అందిస్తా మన్న హామీ మరిచిపోయారు. గ్రామాల్లో ఆసన్నగూడెం, బాదరాల, రంగాపురం, కొత్తపల్లి, అన్నపనేనివారిగూడెం, కొణిజర్ల, నరసన్నపాలెం, కలరాయనగూడెం, బోగోలు రోడ్లు రాళ్లు, గోతులతో ప్రమాదకరంగా మారాయి. ఎన్నికల్లో గెలవగానే వీటన్నింటిని పరిష్కరిస్తామన్న ఎమ్మెల్యే హామీ ఇప్పటివరకు అతీగతీ లేదు.

ధరల స్థిరీకరణ ఏదీ..?

అదికారంలోకి వస్తే ఏటా బడ్జెట్‌లో 3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటుచేసి రైతును రాజును చేస్తాన ని చెప్పిన వైసీపీ ప్రభుత్వం చివరికి నట్టేట ముంచింది. దేశంలోనే పామాయిల్‌ సాగు రాష్ట్రంలో అధికం కాగా రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో ఎక్కువ విస్తీర్నంలో పామాయిల్‌ సాగవుతోంది. పామాయిల్‌ ఽధర తెలంగాణ కన్నా ఎక్కువ అందిస్తానని గత ఎన్నికల ముందు జగన్మోహన్‌ రెడ్డి హమీ ఇచ్చారు. గతేడాది అత్యదిక ధర రూ.23 వేలు పలికిన పామాయిల్‌ ధర ప్రస్తుతం రూ.11 వేలకు పడిపోయింది. విదేశాల నుంచి ఆయిల్‌ దిగుమతి ఎక్కువ అవడంతో ఽపామాయిల్‌ ధరలు పడిపోతున్నాయి. ధరల స్థిరీకరణ నిధితో ఆదుకుం టానన్న ప్రభుత్వం పామాయిల్‌ రైతుల ఊసు ఎత్తడంలేదు.

నెరవేరని హామీలు..

చింతలపూడి పట్టణంలో ప్రతిపక్ష హోదాలో వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో హామీలు గుప్పించారు. తమ ప్రభుత్వం వస్తే చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిచేసి రైతులకు న్యాయం చేస్తామన్నారు. నిర్వాసిత రైతులు ఆయనను కలిసినా పరిష్కారం కాలేదు. ఆయిల్‌ఫాం రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, లేదంటే నిధులు కేటాయించి ఎంఐపీ ద్వారా న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. సీతానగరం–బోయగూడెం రోడ్డు హామీ కూడా నెరవేరలేదు. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం హామీ నెరవేరలేదు.

Updated Date - Apr 19 , 2024 | 12:49 AM