Share News

యువకుల రక్తదానం

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:03 AM

తలసేమియా చిన్నారులకు రక్త నిల్వలులేక ఇబ్బంది గురవుతున్నారని తెలుసుకున్న ఓ యువకుడు తన స్నేహితులను తీసుకువచ్చి రక్తదానం చేశారు.

యువకుల రక్తదానం
రక్తదానం చేస్తున్న యువకులు

ఏలూరు క్రైం, జూన్‌ 8 : తలసేమియా చిన్నారులకు రక్త నిల్వలులేక ఇబ్బంది గురవుతున్నారని తెలుసుకున్న ఓ యువకుడు తన స్నేహితులను తీసుకువచ్చి రక్తదానం చేశారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ఆవరణలోని రెడ్‌క్రాస్‌ బ్లడ్‌ సెంటర్‌లో ప్రతి నెలా తలసేమియా చిన్నారులకు రక్తాన్ని ఎక్కిస్తూ ఉంటారు. వేసవి దృష్ట్యా రక్త నిల్వలకు ఇబ్బందులు కలగడంతో ఈ విషయం తెలుసుకున్న కె.జాషువా అనే యువకుడు తన స్నేహితులను ప్రోత్సహించి రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ బీవీ కృష్ణారెడ్డికి తెలియజేశారు. దీంతో 27 మంది యువకులు వచ్చి రెడ్‌క్రాస్‌లో రక్తదానం చేసి తలసేమియా చిన్నారులకు రక్త కొరతను తీర్చారు. రక్తదానం చేసిన జాషువా అతని స్నేహితులను రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, రెడ్‌క్రాస్‌ వైద్యులు డాక్టర్‌ ఆర్‌ఎస్‌ఆర్‌ఏ వర ప్రసాదరావు, డాక్టర్‌ స్పందన, పీఆర్వో కేవీ రమణ అభినందించారు.

Updated Date - Jun 09 , 2024 | 12:03 AM