Share News

వైసీపీ ప్రభుత్వానికి అంబేడ్కర్‌పై చిత్తశుద్ధి లేదు

ABN , Publish Date - Jan 19 , 2024 | 11:53 PM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి అంబేడ్క ర్‌పై చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వానికి అంబేడ్కర్‌పై చిత్తశుద్ధి లేదు
మాట్లాడుతున్న శ్రీనివాసవర్మ

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసవర్మ విమర్శ

కాళ్ళ, జనవరి 19 : డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామని అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి అంబేడ్క ర్‌పై చిత్తశుద్ధి లేదని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాసవర్మ విమర్శించారు. కాళ్ళ మండలం దొడ్డనపూడి, కాళ్ళకూరు, బొండాడ, ఎస్సీ బోస్‌కాలనీ గ్రామాల్లో వికసిత్‌ భారత్‌ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులతో కలిసి శుక్రవారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కాళ్లలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఆశయాలపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ పేరు పెట్టుకున్న విద్యా పథకానికి గతంలో ఉన్న అంబేడ్కర్‌ పేరే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు.

22న స్కూళ్లకు సెలవు ప్రకటించాలి

అయోధ్య రాముని ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించినా ఏపీలో మాత్రం 22న పాఠశాలలు పునః ప్రారంభించడం దారుణమన్నారు. విజయవాడలో అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు విద్యార్థులను తరలించాలని ఉద్దేశంతో సెలవులు పొడిగించినట్టే అయోధ్య రాముడి ప్రతిష్ఠ రోజున కూడా సెలవు ప్రకటించాలని బీజేపీ తరపున డిమాండ్‌ చేస్తున్నామన్నారు. బీజేపీఉండి ఇన్‌చార్జి కోరా రామ్మూర్తి, ఎస్‌.కాశీవిశేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2024 | 11:53 PM