Share News

పార్టీ అభ్యర్థుల్లో మార్పులు ఉండవు

ABN , Publish Date - Apr 08 , 2024 | 12:11 AM

పార్టీ అభ్యర్థుల్లో ఎటువంటి మార్పులు ఉండవని, అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేస్తున్నారని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రాబోతుందని మాజీ మంత్రి, బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ అన్నారు.

పార్టీ అభ్యర్థుల్లో మార్పులు ఉండవు
సమావేశంలో మాట్లాడుతున్న సిద్ధార్థనాథ్‌ సింగ్‌

బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌

భీమవరం టౌన్‌, ఏప్రిల్‌ 7 :పార్టీ అభ్యర్థుల్లో ఎటువంటి మార్పులు ఉండవని, అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేస్తున్నారని, కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రాబోతుందని మాజీ మంత్రి, బీజేపీ ఏపీ ఎన్నికల ఇన్‌చార్జి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ అన్నారు. భీమవరం బీజేపీ పార్లమెంట్‌ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి జరగ లేదని, ప్యాచ్‌ వర్క్స్‌ కూడా చేయని దద్దమ్మ జగన్‌ ప్రభుత్వమని అన్నారు. బీజేపీ పాలనలో ఇప్పటికే వికసిత్‌ భారత్‌, వికసిత్‌ ఆంధ్ర పేరుతో ఎంతోఅభివృద్ధి చేశామని, 22 లక్షల గృహాలు పేదలకు అందించామని, వీటికి జగన్‌ పేర్లు పెట్టుకోవడం దారుణమన్నారు. కేంద్రం తరపున చేసే పనులకు సీఎం జగన్‌ మ్యాచింగ్‌ గ్రాంట్‌లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీజేపీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్‌ వర్మ మాట్లాడుతూ నరసాపురం పార్లమెంట్‌ అభ్యర్థి మార్పు అంటూ గందరగోళం సృష్టించవద్దని, ఇందులో ఎటువంటి మార్పులు లేవని తానే అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని స్పష్టం చేశారు. నరసాపురం పార్లమెంట్‌ రెండుసార్లు బీజేపీ విజయం సాధించిందని, ఈ ఎన్నికల్లో విజయం సాధించి మూడో ఎంపీ అభ్యర్థిగా గెలుపు సాధిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి తపన చౌదరి, క్లస్టర్‌– కో ఇంచార్జి కోడూరి లక్ష్మీనారాయణ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ పాక సత్యనారాయణ, పార్లమెంట్‌ కన్వీనర్‌ పెరిచర్ల సుభాష్‌రాజు, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 08 , 2024 | 12:11 AM