Share News

నేను సమర్థ్ధుడినే

ABN , Publish Date - Mar 28 , 2024 | 12:30 AM

‘కూటమి తరపున నర సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నన్ను ఎంపిక చేసింది. నా అభ్య ర్థిత్వంపై ఎటువంటి అపో హలకు తావు లేదు. నేను ఆర్థికంగా బలహీనుడినని మీడియాలో కొందరు అభాం డాలు రాశారు. నేను అసమర్ధుడిని కాదు.. సమర్ధుడినని నిరూపిస్తాను’ అని భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు.

నేను సమర్థ్ధుడినే
సమావేశంలో మాట్లాడుతున్న వర్మ

నరసాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి వర్మ

భీమవరం టౌన్‌/ ఆకి వీడు /రూరల్‌/ఉండి, మార్చి 27: ‘కూటమి తరపున నర సాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం నన్ను ఎంపిక చేసింది. నా అభ్య ర్థిత్వంపై ఎటువంటి అపో హలకు తావు లేదు. నేను ఆర్థికంగా బలహీనుడినని మీడియాలో కొందరు అభాం డాలు రాశారు. నేను అసమర్ధుడిని కాదు.. సమర్ధుడినని నిరూపిస్తాను’ అని భూపతిరాజు శ్రీనివాసవర్మ చెప్పారు. మిత్రధర్మం పాటి స్తూ, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉమ్మడి అభ్యర్థుల సహకారంతో అందరమూ విజయం సాధిస్తామని ప్రకటించారు. అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ఆయన బుధవారం భారీ ర్యాలీగా భీమవరం వచ్చారు. తొలుత ఆకివీడు మండలం దుంపగడప ఉప్పుటేరు వంతెన వద్ద ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆకివీడులో అంబేద్కర్‌, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు పూలమాలలు వేశారు. ఉండి పెద్ద ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేశారు. అనంతరం భీమవరం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘దేశంలో మోదీ చేసిన అభివృద్ది, చంద్రబాబు విజన్‌, పవన్‌కల్యాణ్‌ చరిష్మా కూటమి విజయానికి దోహదపడతాయి. అందరి మద్దతు ఎంపీగా గెలుస్తా’నని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ పాకా వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గోదావరి జిల్లాలో రైల్వే లైన్‌ ప్రాజెక్టులు, హైవేల లింకేజీ, ఆక్వా రంగా అభివృద్ధి, ఈఎస్‌ఐ ఆసుపత్రి వంటి ప్రాజెక్టులు సాధిస్తామని చెప్పారు. ఎన్నో ఏళ్ల శ్రమకు నేడు గుర్తింపు వచ్చిందని వర్మ బీజేపీ కార్యాలయం ఆవరణలో వున్న కమలం గుర్తును హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. పలు వురు నేతలు ఆయనను ఓదార్చారు. ఆకివీడులో వర్మకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులకు సమాచారం లేక పోవడంతో ఎవరూ రాలేదని సమాచారం. ఆయనకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి.

Updated Date - Mar 28 , 2024 | 12:30 AM